ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25 తేదీల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ మెగా వేలంలోకి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. గత కొంత కాలంగా గాయాలతో సతమతవుతున్న ఆర్చర్‌కి ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో అతడిని బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు.
కానీ ఇప్పుడు ఆర్చర్ ఈసీబీతో చర్చించినట్లు తెలుస్తుంది. అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు ఈసీబీ ఎన్‌వోసీ మంజారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో 576వ ఆటగాడిగా ఆర్చర్‌ను బీసీసీఐ చేర్చింది.
అయితే భారత క్రికెట్ బోర్డు అతడి బేస్ ప్రైస్‌ను మాత్రం వెల్లడించలేదు. అతడు రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న సెట్‌లో ఉండే అవకాశముంది. ఈ ఇంగ్లండ్ ప్రీమియర్ బౌలర్ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఇక ఆర్చర్‌తో పాటు యూఎస్ఎ స్టార్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్, బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ తమోర్ కూడా వేలం జాబితాలోకి బీసీసీఐ చేర్చింది. మరోవైపు భారత ఆల్‌రౌండర్ దీపక్ హుడాను అనుమానిత బౌలింగ్ జాబితాలో బీసీసీఐ చేర్చింది.
చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment