ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనుంది. ఈ మెగా వేలంలో 17 దేశాలకు చెందిన 1574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. వీరిలో భారత్‌కు చెందిన 1165 ప్లేయర్లు ఉన్నారు. ఈ 1165 మందిలో 965 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది దేశీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు.
ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికొస్తే.. అసోసియేట్ దేశాలకు చెందిన 30 మందిని కలుపుకుని మొత్తం 409 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా (91) నుంచి పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ఆటగాళ్లలో బట్లర్, స్టార్క్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, బెయిర్‌స్టో, రబాడ, జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్లు ఉన్నారు.
దేశాల వారీగా ఆటగాళ్ల సంఖ్య..
ఆఫ్ఘనిస్తాన్- 29
ఆస్ట్రేలియా- 76
బంగ్లాదేశ్- 13
కెనడా- 4
ఇంగ్లండ్- 52
భారత్- 1165
ఐర్లాండ్- 9
ఇటలీ- 1
నెదర్లాండ్స్- 12
న్యూజిలాండ్- 39
స్కాట్లాండ్- 2
సౌతాఫ్రికా- 91
శ్రీలంక- 29
యూఏఈ- 1
యూఎస్‌ఏ- 10
వెస్టిండీస్- 33
జింబాబ్వే- 8
ఐపీఎల్ మెగా వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య- 1574
ఖాళీల సంఖ్య- 204
70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం
వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఖర్చు చేయబోయే బడ్జెట్- రూ. 641.5 కోట్లు
ఏయే ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ ఉంది..?
పంజాబ్ కింగ్స్- రూ. 110.5 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 45 కోట్లు
లక్నో- రూ. 69 కోట్లు
కేకేఆర్- రూ. 51 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు
ఆర్సీబీ- రూ. 83 కోట్లు
సీఎస్‌కే- రూ. 55 కోట్లు
ముంబై ఇండియన్స్- రూ. 45 కోట్లు
గుజరాత్- రూ. 69 కోట్లు
రాజస్థాన్ రాయల్స్- రూ. 83 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment