క్రికెట్ పసికూన జింబాబ్వే.. పాకిస్తాన్‌కు షాకిచ్చింది. 6 మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీస్‌లో జింబాబ్వే-ఏ టీమ్.. 4-2 తేడాతో పాకిస్తాన్-ఏ టీమ్‌ను చిత్తు చేసింది. నిన్న (మే 27) జరిగిన ఆరో వన్డేలో జింబాబ్వే.. పాక్‌ను 32 పరుగుల తేడాతో మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆరో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. క్రెయిగ్ ఇర్విన్ (148 బంతుల్లో 195; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇర్విన్‌కు జతగా ఓపెనర్ ఇన్నోసెంట్ కాలా (79 బంతుల్లో 92; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ముబాసిర్ ఖాన్ (77 బంతుల్లో 115; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా.. రోహైల్ నజీర్ (87), కెప్టెన్ కమ్రాన్ గులామ్ (56) అర్ధసెంచరీలతో రాణించారు. ఫలితంగా పాక్ 49.2 ఓవర్లలో 353 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3, బ్లెసింగ్ ముజరబాని, తనక చివంగ, లూక్ జాంగ్వే తలో 2 వికెట్లు, సీన్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 2 మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌ను పాక్ 2-0తో కైవసం చేసుకుంది. 2 టెస్ట్‌లు, 6 వన్డేల సిరీస్‌ల కోసం పాక్-ఏ జట్టు జింబాబ్వేలో పర్యటించింది.
చదవండి: వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. జై షా కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment