బులవాయో స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 99 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇక 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.
ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ క్రెయిగ్ ఎర్వైన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్నెట్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, ఆర్బర్ ఆహ్మద్, హ్యారీస్ రౌఫ్, జమాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
కమ్రాన్ గులాం సెంచరీ..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులాం(103) తొలి వన్డే సెంచరీ సాధించగా.. షఫీక్(50), మహ్మద్ రిజ్వాన్(37), సల్మాన్ ఆఘా(30) పరుగులతో రాణించారు.
జింబాబ్వే బౌలర్లలో రజా,నగరవా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజాబ్‌రనీ, అక్రమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment