Kamran Ghulam
-
సౌతాఫ్రికా ప్లేయర్ల పట్ల పాక్ ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. మొట్టికాయలు వేసిన ఐసీసీ
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.ఆ మరుసటి ఓవర్లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్‌ల ఓవరాక్షన్‌ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షకీల్, గులామ్‌కు అక్షింతలు వేసింది.కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. -
SA vs Pak: పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్‌టౌన్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్‌ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
జింబాబ్వేను చిత్తు చేసిన పాకిస్తాన్.. సిరీస్ సొంతం
బులవాయో స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 99 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇక 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ క్రెయిగ్ ఎర్వైన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్నెట్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, ఆర్బర్ ఆహ్మద్, హ్యారీస్ రౌఫ్, జమాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కమ్రాన్ గులాం సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులాం(103) తొలి వన్డే సెంచరీ సాధించగా.. షఫీక్(50), మహ్మద్ రిజ్వాన్(37), సల్మాన్ ఆఘా(30) పరుగులతో రాణించారు.జింబాబ్వే బౌలర్లలో రజా,నగరవా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజాబ్రనీ, అక్రమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. -
అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్
‘‘అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను.. కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. నాదైన రోజు వస్తుందని ఓపికగా వేచిచూశా’’.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ అన్న మాటలు ఇవి. 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు.అనూహ్య రీతిలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు పడగా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 224 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా కమ్రాన్ గులామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కమ్రాన్‌ను కొనియాడుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శతకం బాదిన తర్వాత కమ్రాన్ నేలతల్లిని ముద్దాడుతూ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన బాబర్.. ‘‘చాలా బాగా ఆడావు కమ్రాన్’’ అంటూ అభినందించాడు. కాగా పాకిస్తాన్ తరఫున అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 13వ క్రికెటర్‌గా కమ్రాన్ గులామ్ రికార్డు సాధించాడు.తొలి ఆటగాడిగా మరో రికార్డుగతంలో పాక్ తరఫున ఖాలిద్ ఇబాదుల్లా (ఆస్ట్రేలియాపై 1966లో), జావేద్ మియాందాద్ (న్యూజిలాండ్‌పై 1976లో), సలీమ్ మాలిక్ (శ్రీలంకపై 1982లో), మొహమ్మద్ వసీమ్ (న్యూజిలాండ్‌పై 1996), అలీ నక్వీ (దక్షిణాఫ్రికాపై 1997లో), అజహర్ మహమూద్ (దక్షిణాఫ్రికాపై 1997లో), యూనిస్ ఖాన్ (శ్రీలంకపై 2000లో), తౌఫీక్ ఉమర్ (బంగ్లాదేశ్‌పై 2001లో), యాసిర్ హమీద్ (బంగ్లాదేశ్‌పై 2003లో), ఫవాద్ ఆలమ్ (శ్రీలంకపై 2009లో), ఉమర్ అక్మల్ (న్యూజిలాండ్‌పై 2009లో), ఆబిద్ అలీ (శ్రీలంకపై 2019లో) ఈ ఘనత సాధించారు. అయితే, ఇంగ్లండ్‌పై ఓ అరంగేట్ర పాకిస్తాన్ ఆటగాడు శతకం బాదడం ఇదే తొలిసారి.తొలిరోజు.. తడబడి.. నిలబడికమ్రాన్ గులామ్ (224 బంతుల్లో 118; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం కారణంగా రెండో టెస్టులో పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ముల్తాన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కాగా తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం పలు మార్పులు చేసిన పాకిస్తాన్ జట్టు... కమ్రాన్ గులామ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ అయూబ్ (77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (7), కెప్టెన్ షాన్ మసూద్ (3), సౌద్ షకీల్ (4) విఫలమయ్యారు. ఒకదశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయూబ్‌తో కలిసి కమ్రాన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది.మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 29 ఏళ్ల కమ్రాన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసి గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న అతడికి ఎట్టకేలకు అవకాశం దక్కగా... తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, జాక్ లీచ్, కార్స్, పాట్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆఘా సల్మాన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.బాబర్ స్థానంలో ఆడితే ఏంటి?‘ఈ అవకాశం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... దాన్నే ఇక్కడ కూడా కొనసాగించా. బాబర్ ఆజమ్ ఓ దిగ్గజం. అతడి స్థానంలో ఆడుతున్నా అనే విషయం పక్కనపెట్టి కేవలం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. క్రీజులోకి వచ్చిన సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంది.దీంతో ఆచితూచి ఆడాలనుకున్నా. దేశవాళీ అనుభవం బాగా పనికొచ్చింది’ అని కమ్రాన్ అన్నాడు. కాగా కమ్రాన్ గులామ్ ఇప్పటి వరకు 59 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4377 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’