స్వదేశంలో జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. 22 ఏళ్ల అన్ క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ గావిన్ హోయ్ జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. ఈ ఒక్క ఎంపిక మినహా మిగతా జట్టంతా ఊహించిన విధంగానే ఉంది.
సొంతగడ్డపై ఐర్లాండ్‌కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది.
జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఈ నెల 25-29 మధ్యలో బెల్‌ఫాస్ట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం జింబాబ్వే జట్టును ఇదివరకే ప్రకటించారు. జింబాబ్వే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారథ్యం వహించనున్నాడు.
జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌కు ఐర్లాండ్ జట్టు..
ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గావిన్ హోయ్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, ఆండీ మెక్‌బ్రైన్, బారీ మెక్‌కార్తీ, జేమ్స్ మెక్‌కొల్లమ్, పిజె మూర్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్
జింబాబ్వే జట్టు..
డియోన్ మైర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, ప్రిన్స్ మస్వౌర్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, రాయ్ కయా, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, క్లైవ్ మదండే, టనకా చివంగ, టెండాయ్ చటారా, బ్లెస్సింగ్ ముజరబాని, వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యాయుచి
Comments
Please login to add a commentAdd a comment