![Zimbabwe trail by 151 runs with 10 wickets remaining](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/3/zim.jpg.webp?itok=621aAbaM)
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.
రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.
జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment