మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్‌లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు.
వీరిద్దరూ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు.
ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment