త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.
జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.
మరో నలుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.
జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్
Comments
Please login to add a commentAdd a comment