చివరి టి20లోనూ భారత జట్టుదే గెలుపు
మెరిసిన సంజూ సామ్సన్, ముకేశ్ కుమార్
42 పరుగులతో ఓడిన జింబాబ్వే
హరారే: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు జింబాబ్వే పర్యటనను ఘనవిజయంతో ముగించింది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో టీమిండియా 42 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. వరుసగా నాలుగో గెలుపుతో భారత బృందం సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది.
కెప్టెన్ హోదాలో శుబ్‌మన్ గిల్ భారత్‌కు తొలి సిరీస్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌కంటే ముందే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు సాధించింది.
సంజూ సామ్సన్ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అలరించాడు. అనంతరం జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. 26 పరుగులు చేయడంతోపాటు రెండు వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 8 వికెట్లు తీయడంతోపాటు 28 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
సిక్స్‌తో మొదలు...
భారత్ ఇన్నింగ్స్ వరుసగా రెండు సిక్స్‌లతో మొదలైంది. సికందర్ రజా వేసిన తొలి బంతినే యశస్వి జైస్వాల్ (5 బంతుల్లో 12; 2 సిక్స్‌లు) సిక్స్‌గా మలిచాడు. ఇది నోబాల్ కూడా కావడంతో భారత్ ఖాతాలో తొలి బంతికే ఏడు పరుగులు చేరాయి. రెండో బంతిపై కూడా జైస్వాల్ సిక్స్ కొట్టాడు. అయితే మరో రెండు బంతుల తర్వాత జైస్వాల్ బౌల్డ్ అవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో ఓవర్లో అభిõÙక్ ఒక సిక్స్ కొట్టగా... గిల్ రెండు ఫోర్లు బాదాడు.
ముజరబాని వేసిన నాలుగో ఓవర్లో అభిõÙక్ (11 బంతుల్లో 14; 1 సిక్స్), ఎన్‌గరావా వేసిన ఐదో ఓవర్లో గిల్ (14 బంతుల్లో 13; 2 ఫోర్లు) అవుటయ్యారు. దాంతో భారత్ ఐదు ఓవర్లు ముగిసేసరికి 40/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో సంజూ సామ్సన్, రియాన్ పరాగ్ (24 బంతుల్లో 22; 1 సిక్స్) జాగ్రత్తగా ఆడి నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సామ్సన్ 39 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
పరాగ్ పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో భారత స్కోరు 150 దాటింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఒకదశలో 85/3తో పటిష్టంగా కనిపించింది. అయితే మైర్స్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాకజింబాబ్వే తడబడింది. తొమ్మిది పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) సికందర్ రజా 12; శుబ్‌మన్ గిల్ (సి) సికందర్ రజా (బి) ఎన్‌గరావా 13; అభిõÙక్ శర్మ (సి) మందాడె (బి) ముజరబాని 14; సంజూ సామ్సన్ (సి) మరుమాని (బి) ముజరబాని 58; రియాన్ పరాగ్ (సి) ఎన్‌గరావా (బి) మవూటా 22; శివమ్ దూబే (రనౌట్) 26; రింకూ సింగ్ (నాటౌట్) 11; వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–40, 4–105, 5–135, 6–153. బౌలింగ్: సికందర్ రజా 4–0–37–1, ఎన్‌గరావా 4–0–29–1, ఫరాజ్ అక్రమ్ 4–0– 39–0, ముజరబాని 4–0–19–2, మవూటా 4–0–39–1.
జింబాబ్వే ఇన్నింగ్స్: మధెవెరె (బి) ముకేశ్ 0; మరుమాని (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 27; బెనెట్ (సి) దూబే (బి) ముకేశ్ 10; మైర్స్ (సి) అభిõÙక్ (బి) దూబే 34; సికందర్ రజా (రనౌట్) 8; క్యాంప్‌బెల్ (సి) తుషార్ (బి) దూబే 4; మదాండె (సి) సామ్సన్ (బి) అభిõÙక్ శర్మ 1; ఫరాజ్ అక్రమ్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 27; మవూటా (సి అండ్ బి) తుషార్ దేశ్‌పాండే 4; ముజరబాని (నాటౌట్) 1; ఎన్‌గరావా (బి) ముకేశ్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 125. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–59, 4–85, 5–87, 6–90, 7–94, 8–120, 9–123, 10–125. బౌలింగ్: ముకేశ్ 3.3–0–22–4, తుషార్ దేశ్‌పాండే 3–0–25–1, రవి బిష్ణోయ్ 3–0–23–0, వాషింగ్టన్ సుందర్ 2–0–7–1, అభిõÙక్ శర్మ 3–0–20–1, శివమ్ దూబే 4–0–25–2.
5 ఇప్పటి వరకు భారత జట్టు ఐదు మ్యాచ్‌లతో కూడిన ఏడు టి20 ద్వైపాక్ష సిరీస్‌లను ఆడింది. ఇందులో ఐదు సిరీస్‌లను (2020లో న్యూజిలాండ్‌పై; 2021లో ఇంగ్లండ్‌పై; 2022లో వెస్టిండీస్‌పై; 2023లో ఆ్రస్టేలియాపై, 2024లో జింబాబ్వేపై) భారత్ దక్కించుకుంది. ఒక సిరీస్‌ను (2023లో వెస్టిండీస్ చేతిలో) కోల్పోయి, మరో సిరీస్‌ను (2022లో దక్షిణాఫ్రికాతో) సమంగా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment