![Zimbabwe legends son Johnathan Campbell captains on Test debut](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/Untitled-4.jpg.webp?itok=5Q8_oNUg)
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌తో లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ క్యాంప్‌బెల్ తనయుడు జోనాథన్ కాంప్‌బెల్ జింబాబ్వే తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జింబాబ్వే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కాంప్‌బెల్‌కు దక్కింది.
ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రెగ్యూలర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారంణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో 27 ఏళ్ల జోనాథన్‌కు జట్టు పగ్గాలను జింబాబ్వే టీమ్ మెనెజ్‌మెంట్ అప్పగించింది. తద్వారా కాంప్‌బెల్ ఓ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అరంగేట్రంలోనే జింబాబ్వే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో ప్లేయర్‌గా కాంప్‌బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ డేవ్ హౌటన్ ఉన్నాడు. హౌటన్ 1992లో హరారే వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే సారథిగా వ్యవహరించాడు.
ఇక ఓవరాల్‌గా 21వ శతాబ్దంలో డెబ్యూలోనే టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో ప్లేయర్‌గా జోనాథన్ కాంప్‌బెల్ రికార్డులకెక్కాడు. కాంప్‌బెల్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లీ జెర్మెన్ 1995లో భారత్‌తో జరిగిన టెస్టులో తన అరంగేట్రంలోనే కెప్టెన్‌గా పనిచేశాడు.
ఆ తర్వాత స్ధానాల్లో నైమూర్ రెహమాన్ (2000లో బంగ్లాదేశ్), విలియం పోర్టర్‌ఫీల్డ్ (2018లో ఐర్లాండ్), అస్గర్ ఆఫ్ఘన్ (2018లో ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు. వీరిందరూ అరంగేట్రంలోనే తమ జట్ల టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. జోనాథన్ కాంప్‌బెల్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉంది. 34 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలతో సహా 1,913 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 42 వికెట్లు పడగొట్టాడు.
తుది జట్లు:
జింబాబ్వే (ప్లేయింగ్ XI): బెన్ కుర్రాన్, టకుద్జ్వానాషే కైటానో, నిక్ వెల్చ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ కాంప్‌బెల్(కెప్టెన్), వెస్లీ మాధవెరె, న్యాషా మాయావో(వికెట్ కీపర్), న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ న్గారవ, బ్లెస్సింగ్ ముజారబానీ, ట్రెవర్ గ్వాండు
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పీటర్ మూర్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్‌కీపర్), ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, క్రెయిగ్ యంగ్
చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment