బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు.
జింబాబ్వే జట్టులో జాయ్‌లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్‌జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.
అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment