
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్ అర్హత సంపాదించింది. గురువారం జర్మనీతో జరగాల్సిన క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఐర్లాండ్‌కు బెర్త్ లభించింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫైయర్స్‌లో 5 మ్యాచుల్లో 4 విజయాలను ఐర్లాండ్ అందుకుంది. ఇక ఇదివరకే అర్హత సాధించిన స్కాట్లాండ్‌తో శుక్రవారం ఐర్లాండ్ తలపడుతుంది.
యూరోపియన్ రీజినల్ నుంచి రెండు బెర్త్‌లు ఉండగా... స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, జర్మనీ, జెర్సీ, డెన్మార్క్, ఆస్ట్రియా క్వాలిఫయర్స్‌లో తలపడ్డాయి. స్కాట్లాండ్ (10 పాయింట్లు), ఐర్లాండ్ (8 పాయింట్లు) రెండు స్థానాల్లో నిలిచి అర్హత పొందాయి.
మరోవైపు ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్‌లో పాపువా న్యూ గినియా, జపాన్ జట్లు ముందంజలో ఉన్నాయి. అదే విధంగా ఆసియా క్వాలిఫైయర్స్‌లో రెండు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న మలేషియా టాప్‌లో ఉంది.
చదవండి: IND vs WI: మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment