
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 7) కెనడా, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెనడాను 137 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.
ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ (4-0-32-2), బ్యారీ మెక్ కార్తీ (4-0-24-2), మార్క్ అడైర్ (4-0-23-1), గ్యారెత్ డెలానీ (2-0-10-1) సత్తా చాటారు. నికోలస్ కిర్టన్ (49), శ్రేయస్ మొవ్వ (37) ఓ మోస్తరు స్కోర్లు చేయకపోతే కెనడా ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. కెనడా ఇన్నింగ్స్‌లో ఆరోన్ జాన్సన్ (14), నవ్‌నీత్ ధలివాల్ (6), దిల్‌ప్రీత్ బజ్వా (7), పర్గత్ సింగ్ (18), దిల్లన్ హెలిగర్ (0) విఫలమయ్యారు.
తుది జట్లు..
కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ(వికెట్‌కీపర్), దిల్‌ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్
ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్‌కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్
Comments
Please login to add a commentAdd a comment