
ఆసియా కప్ 2023కి ముందు టీమిండియాకు మాంచి బూస్టప్ లాంటి వార్త వినిపించింది. ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్‌తో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నారు.
ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. గాయాల కారణంగా గతేడాది నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న వీరు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం వీరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) రిహాబ్‌లో ఉన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
కాగా, వెన్ను సమస్య కారణంగా 2022 సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న బుమ్రా.. ఇటీవలే పూర్తిగా కోలుకుని, ప్రస్తుతం నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అతను నెట్స్‌లో అవిశ్రాంతంగా 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అతను చివరిగా ఈ ఏడాది మార్చిలో ఆసీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment