ఆఫ్గానిస్తాన్.. పేరుకే పసికూన. కానీ తనదైన రోజును వరల్డ్‌క్లాస్ జట్లను సైతం ఓడించే సత్తా ఉంది. రోజుకు రోజుకు ఆఫ్గాన్ క్రికెట్ జట్టు మెరుగుపడుతూ వస్తోంది. ఇటీవల కాలంలో శ్రీలంక, పాకిస్తాన్ వంటి మేటి జట్లకు ఆఫ్గాన్ చుక్కలు చూపించింది. ఈ క్రమంలో భారత్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో అద్భుతాలు సృష్టించాలని ఆఫ్గాన్ జట్టు వ్యూహాలు రచిస్తోంది. అస్సలు ఆఫ్గాన్ జట్టు బలబాలాలు ఎంటో ఓ లూక్కేద్దం.
వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు..
ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌లలో ఆఫ్గాన్ భాగమైంది. 2015, 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గాన్ ఆడింది. ఇప్పటివరకు 15 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ఆఫ్గానిస్తాన్ జట్టు.. కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. అది కూడా 2015 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్పై గెలిచింది.
ఆఫ్గాన్ బలం ఎంత?
అయితే ఆఫ్గాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పటిష్టంగా ఉంది. ఈ రెండు విభాగాల్లోనూ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ఆఫ్గాన్ క్రికెట్ జట్టులో ముఖ్యంగా రషీద్ ఖాన్ వంటి వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్ ఉన్నారు.
ఇటీవల కాలంలో ఆఫ్గాన్ పెద్దగా విజయాలు సాధించకపోయినప్పటికీ.. రషీద్ మాత్రం తన అద్బుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. అదే విధంగా మహ్మద్ నబీ ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు. ఆసియాకప్-2023లో శ్రీలంకపై అతడు విరోచిత పోరాటం ఎప్పటికి ఎవరూ మరిచిపోరు.
వీరిద్దరికి తోడు ముజ్‌బర్ రెహ్మన్ వంటి స్పిన్ మాంత్రికుడు ఉన్నాడు. పవర్‌ప్లేలో కొత్త బంతితో ముజీబ్‌అద్బుతాలు చేయగలడు. ఇక బ్యాటింగ్‌లో రహ్ముతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ షాహిదీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో లెఫ్ట్ ఆర్మర్ ఫజల్హాక్ ఫరూఖీ వంటి సూపర్ స్టార్ ఉన్నాడు. కాబట్టి ఏ జట్టు అయినా ఆఫ్గాన్ తక్కువగా అంచనావేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
వరల్డ్‌కప్‌కు ఆఫ్గాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్- హక్
Comments
Please login to add a commentAdd a comment