IPL 2024 GT VS PBKS: ఫిఫ్టి కొట్టిన రషీద్‌ ఖాన్‌ | IPL 2024 GT VS PBKS: Rashid Khan Becomes The First Gujarat Titans Bowler To Complete 50 Wickets In IPL | Sakshi
Sakshi News home page

IPL 2024 GT VS PBKS: రషీద్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ

Published Fri, Apr 5 2024 1:11 PM | Last Updated on Fri, Apr 5 2024 2:41 PM

IPL 2024 GT VS PBKS: Rashid Khan Becomes The First Gujarat Titans Bowler To Complete 50 Wickets In IPL - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ తరఫున 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్‌లో జితేశ్‌ శర్మ వికెట్‌ సాధించడం ద్వారా రషీద్‌ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లోనే (సన్‌రైజర్స్‌తో) షమీని అధిగమించి గుజరాత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించిన రషీద్‌.. తాజాగా మరో మైలురాయిని తాకాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో రషీద్‌ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. 

ఐపీఎల్‌లో గుజరాత్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు..

  • రషీద్‌ ఖాన్‌-50
  • మొహమ్మద్‌ షమీ-48
  • మోహిత్‌ శర్మ-34
  • నూర్‌ అహ్మద్‌-17
  • అల్జరీ జోసఫ్‌-14

మ్యాచ్‌ విషయానికొస్తే.. శాశం​క్‌ సింగ్‌ (29 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్‌ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) అనూహ్య రీతిలో విరుచుకుపడటంతో గుజరాత్‌పై పంజాబ్‌ సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (89 నాటౌట్‌) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్‌ శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement