IPL 2024: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. ష‌మీ రికార్డు బ‌ద్ద‌లు | Rashid Khan Breaks Mohammed Shamis Record To Become GTs Highest Wicket-Taker In IPL, See Details - Sakshi
Sakshi News home page

IPL 2024: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. ష‌మీ రికార్డు బ‌ద్ద‌లు

Published Sun, Mar 31 2024 5:23 PM | Last Updated on Sun, Mar 31 2024 6:11 PM

Rashid Khan breaks Mohammed Shamis record to become GTs highest wicket-taker in IPL - Sakshi

గుజ‌రాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ర‌షీద్ ఖాన్ రికార్డులెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసిన ర‌షీద్‌.. ఈ అరుదైన ఫీట్‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

రషీద్ ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో గుజ‌రాత్ త‌ర‌పున 49 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు గుజ‌రాత్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ షమీ(48) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ష‌మీని ర‌షీద్ అధిగ‌మించాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌కు గాయం కార‌ణంగా మ‌హ్మ‌ద్ ష‌మీ దూర‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అబ్దుల్ స‌మ‌ద్‌(29), అభిషేక్ శ‌ర్మ‌(29) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ల‌గా నిలిచారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మొహిత్ శ‌ర్మ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఉమేశ్ యాద‌వ్‌, ఒమ‌ర్జాయ్‌, నూర్ అహ్మ‌ద్, ర‌షీద్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement