
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల యువ వికెట్‌కీపింగ్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది.
గత వరల్డ్‌కప్‌లో ఆడని కరీం జనత్, నూర్ అహ్మద్‌లకు ఈసారి అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ల ప్రధాన బలమైన స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్‌తో పాటు మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ ఉన్నారు. పేసర్ల విభాగంలో నవీన్ ఉల్ హాక్, ఫరీద్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యారు.
వికెట్‌కీపర్ల కోటాలో రహ్మానుల్లా గుర్భాజ్ జట్టులోకి రాగా.. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల కోటాలో కరీం జనత్, గుల్బదిన్ నైబ్, హజ్రతుల్లా ఒమర్‌జాయ్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు. సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.
జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం జూన్ 3న మొదలవుతుంది. ఆ రోజు గయానా వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఉగాండతో తలపడతారు. జూన్ 7న ఇదే వేదికపై వీరు పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొంటారు. గ్రూప్-సిలో ఆఫ్ఘనిస్తాన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లతో పోటీపడుతుంది.
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్
ట్రావెలింగ్ రిజర్వ్స్: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ
Comments
Please login to add a commentAdd a comment