![Klaasen Punches His Bat In Anger As Rashid Khan Castles Stunning Delivery - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/31/klasen.gif.webp?itok=Ctp1q1C6)
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 24 పరుగులు చేశాడు. అయితే తనకు వచ్చిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గామలచడంలో క్లాసెన్ విఫలమయ్యాడు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్బుతమైన బంతితో క్లాసెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్‌లో మూడో బంతిని రషీద్ ఫ్లాట్‌గా సంధించాడు. బంతి టర్న్ అవుతుందని భావించిన క్లాసెన్.. ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఫ్లాట్‌గా వచ్చిన బంతి క్లాసెన్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది.
దీంతో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ క్లాసెన్ మాత్రం నిరాశతో తన బ్యాట్‌కు పంచ్‌లు ఇస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
— Sitaraman (@Sitaraman112971) March 31, 2024
Comments
Please login to add a commentAdd a comment