IPL 2023,GT Vs KKR: Rashid Khan World Record Of Most Hat-Tricks Against Kolkata Knight Riders, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: రషీద్‌ ఖాన్‌ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్‌

Published Mon, Apr 10 2023 9:21 AM | Last Updated on Mon, Apr 10 2023 9:40 AM

Rashid Khan World Record of most hat-tricks in GT vs KKR clash - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ ఓటమిపాలైంది. కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌.. సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌కు ఊహించని షాక్‌ ఇచ్చాడు.  కోల్‌కతా విజయం సాధించాలంటే చివరి 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. అటువంటి సమయంలో రింకూ వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు మరిచిపోలేని విజయం అందించాడు.

రషీద్‌ ఖాన్‌ ప్రపంచ రికార్డు..
ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ వ్యవహరించిన రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో రషీద్‌ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రషీద్‌ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు.

ఇప్పటివరకు టీ20ల్లో నాలుగు సార్లు రషీద్‌ హ్యాట్రిక్‌  సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో రషీద్‌ తర్వాతి స్థానంలో అండ్రూ టై, మహ్మద్‌ షమీ, అమిత్‌ మిశ్రా, రస్సెల్‌, తహీర్‌ ఉన్నారు. వీరిందరూ ఇప్పటివరకు మూడు సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టారు. కాగా రషీద్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం విశేషం​.
చదవండి: IPL 2023: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్‌! ఎవరీ రింకూ సింగ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement