దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. భారత్‌లో ఏబీడికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ 360.. తన ఆటతీరుతో అందరిని మంత్రముగ్ధులను చేశాడు.
ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా డివిలియర్స్ బాధ్యతలు చేపట్టునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రపంచక్రికెట్‌లో ఇప్పటివరకు తన అత్యుత్తమ టీ20 క్రికెటర్ ఎవరని ఏబీడిని అడగ్గా.. అందుకు అతడు ఏమీ ఆలోచించకుండా రషీద్ ఖాన్ అంటూ బదులు ఇచ్చాడు.
"ప్రపంచ టీ20 క్రికెట్‌లో నా అల్ టైమ్ ఫేవరేట్ ప్లేయర్ రషీద్ ఖాన్. రషీద్ బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించగలడు. రెండు విభాగాల్లో తన జట్టుకు 100 శాతం ఎఫక్ట్ ఇవ్వగలడు. అతడు ఫీల్డ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ప్రపంచ క్రికెట్‌లో నెం1గా ఉండాల్సిన అర్హతలు అన్ని అతడికి ఉన్నాయి" అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత టీ20 క్రికెట్‌ను శాసిస్తున్న స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్‌ను గాని డివిలియర్స్ ఎంచుకోకపోవడం గమానార్హం.
చదవండి: Faf du Plessis: దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్.. మూడేళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment