లంక ప్రీమియర్ లీగ్ 2024లో గాలె మార్వెల్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రెచ్చిపోయాడు. జాఫ్నా కింగ్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో (47 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు.
హేల్స్‌తో పాటు నిరోషన్ డిక్వెల్లా (27 బంతుల్లో 47; 8 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనాగే (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), జహూర్ ఖాన్ (4-0-24-3), ప్రిటోరియస్ (4-0-23-2), ఉడాన (4-0-60-2) రాణించడంతో మార్వెల్స్ 5 వికెట్ల తేడాతో జాఫ్నాపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక (51), అవిష్క ఫెర్నాండో (59), అసలంక (33) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్ చివరి బంతికి విజయం సాధించింది. మార్వెల్స్ గెలుపు చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. సహన్ బౌండరీ బాదాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో, ఫేబియన్ అలెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డిసిల్వ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
రాణించిన వెల్లలగే, షాదాబ్ ఖాన్
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌పై కొలొంబో స్ట్రయికర్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. సమరవిక్రమ (48), తిసార పెరీరా (38), ముహమ్మద్ వసీం (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో రజిత, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. షనక, చమీరా, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ.. దునిత్ వెల్లలగే (4/20). షాదాబ్ ఖాన్ (4/22) రెచ్చిపోవడంతో 15.5 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. చండీమల్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment