
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో గాలే మార్వెల్స్ నాలుగో విజయం సాధించింది. నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో మార్వెల్స్.. క్యాండీ ఫాల్కన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
ఆండ్రీ ఫ్లెచర్ (43 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), చండీమల్ (14 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (15 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రమేశ్ మెండిస్ (14 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మార్వెల్స్ బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 3, ప్రిటోరియస్ 2, ఉడాన, తీక్షణ, నదీశన్ తలో వికెట్ పడగొట్టారు.
హేల్స్ విధ్వంసం
188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్.. అలెక్స్ హేల్స్ (55 బంతుల్లో 86 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), భానుక రాజపక్స (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
మార్వెల్స్ ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా 25, టిమ్ సీఫర్ట్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. హసరంగ, ఫ్లెచర్ మాత్రం తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment