లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఐదుగురు బ్యాటర్లు కలిసి ఏకంగా 17 సిక్సర్లు బాదారు. వీరిలో ఆండ్రీ ఫ్లెచర్ (7), ఏంజెలో మాథ్యూస్ (5) మాత్రమే 12 సిక్సర్లు కొట్టారు. కమిందు మెండిస్, మొహమ్మద్ హరీస్ తలో 2, చండీమల్ ఓ సిక్సర్ బాదారు. బ్యాటర్లంతా తలో చేయి వేసి సిక్సర్ల మోత మోగించడంతో ఫాల్కన్స్ భారీ స్కోర్ చేసింది.
ఫ్లెచర్, మెండిస్ అర్ద సెంచరీలు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ ఫాల్కన్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (34 బంతుల్లో 60; ఫోర్, 7 సిక్సర్లు), కమిందు మెండిస్ (24 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 44 నాటౌట్; 5 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. డంబుల్లా బౌలర్లలో దుషన్ హేమంత ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. సోనల్ దినుషకు ఓ వికెట్ దక్కింది.
హసరంగ మాయాజాలం
223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిక్సర్స్.. హసరంగ (4-0-35-4), దసున్ షకన (4-0-29-3) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు (9 వికెట్ల నష్టానికి) మాత్రమే చేసి, 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా (74) ఒక్కడే రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment