Andre Fletcher
-
సిక్సర్ల మోత మోగించిన ఫ్లెచర్, మాథ్యూస్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఐదుగురు బ్యాటర్లు కలిసి ఏకంగా 17 సిక్సర్లు బాదారు. వీరిలో ఆండ్రీ ఫ్లెచర్ (7), ఏంజెలో మాథ్యూస్ (5) మాత్రమే 12 సిక్సర్లు కొట్టారు. కమిందు మెండిస్, మొహమ్మద్ హరీస్ తలో 2, చండీమల్ ఓ సిక్సర్ బాదారు. బ్యాటర్లంతా తలో చేయి వేసి సిక్సర్ల మోత మోగించడంతో ఫాల్కన్స్ భారీ స్కోర్ చేసింది.ఫ్లెచర్, మెండిస్ అర్ద సెంచరీలుఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ ఫాల్కన్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (34 బంతుల్లో 60; ఫోర్, 7 సిక్సర్లు), కమిందు మెండిస్ (24 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 44 నాటౌట్; 5 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. డంబుల్లా బౌలర్లలో దుషన్ హేమంత ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. సోనల్ దినుషకు ఓ వికెట్ దక్కింది.హసరంగ మాయాజాలం223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిక్సర్స్.. హసరంగ (4-0-35-4), దసున్ షకన (4-0-29-3) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు (9 వికెట్ల నష్టానికి) మాత్రమే చేసి, 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా (74) ఒక్కడే రాణించాడు. -
సిక్సర్ల మోత మోగించిన పూరన్, ఫ్లెచర్.. దద్దరిల్లిన షార్జా స్టేడియం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-2 బెర్తులతో (గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్) పాటు ఓ ఫైనల్ బెర్త్ (డెసర్ట్ వైపర్స్) ఖరారయ్యాయి. గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ విన్నర్ ఫిబ్రవరి 12న జరిగే లీగ్ తుది పోరులో డెసర్ట్ వైపర్స్‌తో తలపడుతుంది. ఇక, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్ మధ్య నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఎంఐ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఎంఐ టీమ్.. దుబాయ్ క్యాపిటల్స్‌ను 151/5 స్కోర్‌కే పరిమితం చేసింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో ఓ వికెట్ దక్కించుకున్నాడు. దుబాయ్ ఇన్నింగ్స్‌లో మున్సే (43 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించగా.. సికందర్ రజా (34 బంతుల్లో 38; 4 ఫోర్లు), రోవ్‌మన్ పావెల్ (22 బంతుల్లో 30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. పేలిన పూరన్, ఫ్లెచర్.. .. దద్దరిల్లిన షార్జా స్టేడియం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ టీమ్.. కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ ఫ్లెచర్ (45 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన మెరుపు అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. దుబాయ్ బౌలర్లలో జేక్ బాల్, దసున్ శనకలకు తలో వికెట్ దక్కింది. ముహమ్మద్ వసీమ్ (2), లోర్కాన్ టక్కర్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఫ్లెచర్, పూరన్ జోడీ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి, తమ జట్టును క్వాలిఫయర్-2కు చేర్చారు. పూరన్, ఫ్లెచర్ మెరుపు విన్యాసాల ధాటికి షార్జా స్టేడియం దద్దరిల్లింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
మ్యాచ్ ఆధ్యంతం బ్యాట్స్‌మన్ సిక్సర్ల వర్షం కురిపించడం ఒక ఎత్తు.. కానీ టప్ గేమ్‌ను సిక్సర్లతో ముగించడం మరొక ఎత్తు. ఆ బాధ్యతను విండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ సమర్థంగా నిర్వహించాడు. 3 బంతుల్లో 16 పరుగులు చేస్తే జట్టు గెలుస్తుంది. ప్రతీ బంతి సిక్సర్ వెళితే గానీ సదరు జట్టు గెలవదు. కానీ ఫ్లెచర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కాగా ఫ్లెచర్‌కు ''స్పైస్మాన్'' అనే బిరుదు కూడా ఉంది. విషయంలోకి వెళితే.. విన్సీ ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా బొటానికల్ గార్డెన్స్ రేంజర్స్, ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. నరాల తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బొటానికల్ గార్డెన్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బొటానికల్ గార్డెన్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి. కొర్టోన్ లావియా ఆఖరి ఓవర్ వేయగా.. క్రీజులో ఫ్లెచర్ ఉన్నాడు. అప్పటికే 27 బంతుల్లో 39 పరుగులతో ఆడుతున్నాడు. మొదటి బంతికి ఎలాంటి పరుగు రాలేదు. రెండో బంతికి లెగ్‌బైస్, నో బాల్ రూపంలో బౌండరీతో పాటు ఒక రన్ అదనంగా వచ్చింది. మరుసటి రెండు బంతులు డాట్ బాల్స్. దీంతో చివరి మూడు బంతుల్లో 16 పరుగులు కావాలి. లావియా వేసిన ఫుల్‌టాస్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ మరుసటి బంతిని మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. అంతే ఆఖరి బంతికి సిక్స్ కొడితే ఫ్లెచర్ జట్టు విజయాన్ని అందుకుంటుంది. అలా చివరి బంతి వేయగానే ఫ్లెచర్ స్ట్రెయిట్ సిక్స్‌ను సంధించాడు. ఫ్లెచర్ 34 బంతుల్లో మెరుపు అర్థశతకంతో పాటు జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఫ్లెచర్‌పై సహచరులు అభినందనల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు PAK vs AUS: స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు! 16 needed off 3 balls and @AndreFletch delivers! 🔥 📺 Watch the captivating innings on #FanCode 👉 https://t.co/Fg9i08WZLv pic.twitter.com/jn3AmZCQPR — FanCode (@FanCode) March 24, 2022 -
Andre Fletcher: దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన వెస్టిండీస్ బ్యాటర్.. అయితే..
BPL 2022: వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రీ ఫ్లెచర్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఖుల్నా టైగర్స్, చట్టోగ్రామ్ చాలెంజర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఖుల్నాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్లెచర్‌కు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయమైంది. ప్రత్యర్థి జట్టు బౌలర్ రహమాన్ రజా సంధించిన బంతి మెడకు బలంగా తాకడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఫ్లెచర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఖుల్నా టైగర్స్ మేనేజర్ తెలిపారు. ‘‘తనకు ఎటువంటి ప్రమాదం లేదు. ముందు జాగ్రత్త చర్యగానే ఆస్పత్రికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం బాగానే ఉన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టైగర్స్‌కు ఓటమే ఎదురైంది. 25 పరుగుల తేడాతో చిట్టోగ్రామ్ చాలెంజర్స్.. టైగర్స్‌పై విజయం సాధించింది. ఒక వికెట్ తీయడంతో పాటుగా.... 34 పరుగులతో అజేయంగా నిలిచిన బెన్నీ హావెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. స్కోర్లు: చిటోగ్రామ్- 190/7 (20) టైగర్స్- 165/9 (20) -
బంతి ఎలా పడిందన్నది చూడకుండానే.. షాక్ తిన్న బౌలర్
సెంట్కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో సెంట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య ఆదివారం లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెంట్ లూసియా కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే సెంట్ లూసియా కింగ్స్ ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ కొట్టిన ఒక సిక్స్ వైరల్‌గా మారింది. ఇసురు ఉడాన వేసిన బంతిని ఫ్లెచర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. అయితే ఫ్లెచర్ కనీసం బంతి ఎక్కడ పడిందనేది చూడకుండానే ఆడాడంటే అతని కాన్ఫిడెంట్ ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ 8.4 ఓవర్లో ఇది చోటుచేసుకుంది. చదవండి: 20 ఓవర్లలో 32 పరుగులు.. టీ20 మ్యాచ్‌ను కాస్త టెస్టు మ్యాచ్‌గా కాగా భారీ షాట్లకు పెట్టింది పేరైన ఫ్లెచర్‌ను అందరూ ముద్దుగా స్పైస్మన్ అని పిలుచుకుంటారు.కాగా ఈ మ్యాచ్‌లో ఫ్లెచర్ 28 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బౌలర్ రామ్‌పాల్ 3 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. టిమ్ స్టిఫర్ట్ 16 బంతుల్లో 40 పరుగులు చేసినప్పటికి గెలిపించలేకపోయాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్ NO LOOK SIX! The SPICEMAN Andre Fletcher with the @OmegaXL HIT from match 7. #CPL21 #SLKvTKR #CricketPlayedLouder pic.twitter.com/b3PC3lZwBa — CPL T20 (@CPL) August 29, 2021 -
క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అరెస్ట్
కింగ్ స్టన్: అక్రమ ఆయుధాల కేసులో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్(27) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అక్రమంగా ఆయుధాలను తరలిస్తుండగా డొమానికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విండ్ వార్డ్ ఐస్ లాండ్ టీంలో ఫ్లెచర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 2008లో వెస్టిండీస్ జట్టులోకి వచ్చిన ఫ్లెచర్ 15 వన్డేలు, 22 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడాడు. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 అతను చివరిసారి కనిపించాడు. ఆ మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఫ్లెచర్ చేశాడు.