Would Love to See Virat Kohli Playing in Lanka Premier League Says Bhanuka Rajapaksa - Sakshi
Sakshi News home page

Bhanuka Rajapaksa: లంక ప్రీమియర్‌ లీగ్‌లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్‌ మనసులో మాట..!

Published Tue, Dec 14 2021 8:30 PM | Last Updated on Wed, Dec 15 2021 8:41 AM

Would Love To See Virat Kohli Playing In Lanka Premier League Says Bhanuka Rajapaksa - Sakshi

కొలొంబో: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అమితంగా ఆరాధించే చాలామంది ప్రస్తుత తరం క్రికెటర్లలో ఒకరైన శ్రీలంక బ్యాటర్‌ భానుక రాజపక్స తన ఆరాధ్య క్రికెటర్‌ గురించిన ప్రస్తావన సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంక ప్రీమియర్‌ లీగ్‌లో కోహ్లి ఆడితే చూడలని ఉందంటూ తన మనసులో దాగి ఉన్న కోర్కేను బయటపెట్టాడు. 

ఫేవరెట్‌ ఇండియన్‌ క్రికెటర్‌ ఎవరన్న అంశంపై జాతీయ మీడియా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కోహ్లి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లలో ఒకడని, అతనిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, కోహ్లిని చూసే తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని తెలిపాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ నుంచి షాహిద్‌ అఫ్రిది తప్పుకోవడంతో రాజపక్సకు గాలె గ్లాడియేటర్స్‌ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. లీగ్‌లో భాగంగా గాలె గ్లాడియేటర్స్‌ ఇవాళ(డిసెంబర్‌ 14) డంబుల్లా జెయింట్స్‌తో తలపడాల్సి ఉంది. 
చదవండి: KS Bharat: మరోసారి శ'చి'తక్కొట్టిన ఆంధ్రావాలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement