
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను శ్రీలంక జట్టు విజయంతో ముగించింది. వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక ఆదివారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. 155 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ కుశాల్ మెండిస్ (58 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కెప్టెన్ దసున్ షనక (31 బంతుల్లో 35; 2 సిక్స్‌లు)తో కలిసి మెండిస్ ఐదో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 154 పరుగులు సాధించింది. మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. ఫించ్ నాయకత్వం లోని ఆస్ట్రేలియా 4–1తో సిరీస్‌ను సొంతం చేసుకోగా మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment