
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంక జట్టు విజయం సాధించింది. సిరీస్‌లో ఇంతకుముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై ఢీలా పడ్డ లంక జట్టు ఎట్టకేలకు ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో గెలుపొంది, వైట్ వాష్ బారి నుంచి తప్పించుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా, ఛేదనలో శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని (19.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 155 పరుగులు) చేరుకుని ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (58 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కెప్టెన్ దసున్ షనక (31 బంతుల్లో 35; 2 సిక్సర్లు) మెండీస్‌కు సహకరించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అంతకుముందు మ్యాథ్యూ వేడ్ (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్ వెల్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా, టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. సిరీస్‌లో మ్యాక్సీ 138 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ తీశాడు.
చదవండి: IPL 2022: హార్ధిక్ పాండ్యా జట్టుకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఎట్టకేలకు..!
Comments
Please login to add a commentAdd a comment