
క్రిస్ గేల్ బ్యాటింగ్
హరారే: స్కాట్‌లాండ్‌తో బుధవారం జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. టాస్ గెలిచి విండీస్‌కు బ్యాటింగ్ అప్పగించిన స్కాట్‌లాండ్ అద్భుతం చేసింది. ఇద్దరు టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్లను డకౌట్ చేసి సంచలనం సృష్టించింది.
విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయి ‘గోల్డెన్ డక్’గా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్ ఆరు బంతులు ఆడి డకౌటయ్యాడు. వీరిద్దరినీ స్కాట్‌లాండ్ బౌలర్ సఫయాన్ మహ్మద్ షరీఫ్ అవుట్ చేశాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ కుదురుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. స్కాట్‌లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు మాత్రమే చేసింది.
Comments
Please login to add a commentAdd a comment