గోల్డెన్‌ డక్‌.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు | Abhishek Sharma 7 Ducks-Most ducks Calendar year T20s by-Indian | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ డక్‌.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు

Apr 13 2026 9:02 PM | Updated on Apr 13 2026 9:10 PM

Abhishek Sharma 7 Ducks-Most ducks Calendar year T20s by-Indian

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ తొలి బంతికే వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ర‌వి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డ‌క్ అయ్యాడు. త‌ద్వారా అభిషేక్ శ‌ర్మ త‌న పేరిట అత్యంత చెత్త రికార్డును మూటగ‌ట్టుకున్నాడు. అదేంటంటే..

  • 2026 సీజ‌న్ టీ20 క్రికెట్‌లో అభిషేక్‌ శ‌ర్మ‌కు ఇది ఏడో గోల్డెన్ డ‌క్‌. 2026 సీజ‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 18 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు గోల్డెన్ డ‌కౌట్ అయ్యి అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా నిలిచాడు.అంత‌క‌ముందు కూప‌ర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

  • ఇక ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున తొలి బంతికే వెనుదిరిగిన రెండో బ్యాట‌ర్‌గా అభిషేక్ శ‌ర్మ మ‌రో చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. గ‌తంలో శిఖ‌ర్ దావ‌న్ 2018 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో తొలి బంతికే ఔట‌య్యి గోల్డెన్ డ‌క్‌ అయి తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

  • భార‌త్ త‌ర‌ఫున టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్ల జాబితాలోనూ అభిషేక్ చోటు సంపాదించాడు. ఏడుసార్లు డ‌కౌట్ అయిన అభిషేక్ తొలి స్థానంలో ఉండ‌గా, రోహిత్ శ‌ర్మ (2018లో ఆరుసార్లు), సంజూ శాంస‌న్ (2024లో ఆరు సార్లు), గురుకీర‌త్ సింగ్ (2103లో 5 సార్లు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  • ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీయ‌డం ఆర్చ‌ర్‌కు ఇది నాలుగోసారి. టీమిండియా వెట‌ర‌న్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఐపీఎల్‌లో ఈ ఫీట్‌ను 5 సార్లు న‌మోదు చేయ‌డం విశేషం.

  • ఐపీఎల్ చ‌రిత్ర‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి బంతికే వికెట్ తీయ‌డం ఇది 24వ సారి. ఐపీఎల్‌లో ఏ జ‌ట్టుకైనా ఇదే అత్య‌ధికం. ముంబై ఇండియ‌న్స్ 22సార్లు ఈ ఫీట్ న‌మోదు చేసింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement