
Rohit Sharma Golden Duck: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు ఘనమైన ఆరంభం లభించలేదు. అంతేగాక మరుసటి ఓవర్లోనే రాహుల్ కూడా క్లీన్ బౌల్డ్ అవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది.
అయితే రోహిత్ శర్మ ఔటైన తీరుపై టీమిండియా ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ఏంటి రోహిత్ ఇలా చేశావు.. పాక్‌తో మ్యాచ్ మనకు కీలకమని తెలుసుగా.. రోహిత్ మమ్మల్ని నిరాశపరిచావు. అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: SL Vs BAN: బ్యాట్స్‌మన్ కంటే వేగంగా పరిగెత్తాడు.. రిస్క్ అని తెలిసినా
Shaheen Afridi traps Rohit Sharma plumb via @t20worldcup https://t.co/kbNoHGNYWY
— varun seggari (@SeggariVarun) October 24, 2021