Photo: IPL Twitter
ఏప్రిల్ 23.. ఆర్‌సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఏ మాత్రం కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ తేదీన ఆర్‌సీబీ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం గమనార్హం. మరో విచిత్రమేంటంటే.. ఏప్రిల్ 23న కోహ్లి గోల్డెన్ డక్ అయిన రెండు సందర్భాల్లో ఆర్‌సీబీకి ఓటములే ఎదురయ్యాయి. మరి కోహ్లికి చీకటి రోజుగా మిగిలిపోయిన రెండు సందర్భాలను ఒకసారి చూసేద్దాం.
ఏప్రిల్ 23, 2017: ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్
ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చి తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నాథన్ కౌల్టర్‌నీల్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 82 పరుగులతో ఘన విజయం సాధించింది.
ఏప్రిల్ 23, 2022: ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్
ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన కోహ్లి మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 68 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ 8 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఏప్రిల్ 23,2023: ఆర్‌సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆదివారం(ఏప్రిల్ 23న) రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి బౌల్ట్ వేసిన తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. మరి ఈ మ్యాచ్ ఫలితం ఆర్‌సీబీకి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
23rd April - A day to forget for Virat Kohli.
— CricTracker (@Cricketracker) April 23, 2023
📸: IPL#ViratKohli #TrentBoult #RCBvsRR pic.twitter.com/tyxVr7ciwy
̶L̶i̶g̶h̶t̶n̶i̶n̶g̶ 𝐁𝐨𝐮𝐥𝐭 𝐬𝐭𝐫𝐢𝐤𝐞𝐬 𝐭𝐰𝐢𝐜𝐞 ⚡⚡#RCBvRR #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/SwM0SekfBQ
— JioCinema (@JioCinema) April 23, 2023
Comments
Please login to add a commentAdd a comment