
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో కోహ్లి మరోసారి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెడుతూ వికెట్ ఇచ్చుకున్నాడు. అప్పటికే దుశ్మంత చమీర మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తూ అనూజ్ రావత్‌ను ఔట్ చేశాడు. కోహ్లి బలహీనత తెలిసిన రాహుల్.. చమీరను ఆఫ్‌స్టంప్ దిశగా బంతి వేయమని సలహా ఇచ్చాడు. అంతే చమీర ఆఫ్‌సంప్‌పై ఊరిస్తూ వేసిన బంతిని కోహ్లి ఏ మాత్రం ఆలోచించకుండా ఫోర్ కొట్టే ప్రయత్నంలో సరిగ్గా బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కోహ్లి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఒక అనవసర రికార్డును మూటగట్టుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో కోహ్లి గోల్డెన్ డక్ కావడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 2008లో ఆశిష్ నెహ్రా , 2014లో సందీప్ శర్మ , 2017లో నాథన్ కౌల్టర్‌నీల్.. తాజగా దుష్మంత చమీరలు కోహ్లిని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చారు. అంతేకాదు ఈ సీజన్‌లో కోహ్లి పవర్ ప్లేలో ఔటవ్వడం ఇది మూడోసారి. నాలుగు మ్యాచ్‌ల్లో కోహ్లి పవర్ ప్లే సమయానికి క్రీజులోకి వచ్చి మూడుసార్లు ఔటయ్యాడు. ఈ నాలుగు సందర్భాల్లో కోహ్లి 25 పరుగులు మాత్రమే చేశాడు.
First ball duck for Virat Kohli 😔 #IPL2022 #LSGvRCB pic.twitter.com/27qr5AF1oC
— That-Cricket-Girl (@imswatib) April 19, 2022