టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న రోహిత్ నిర్ణయం సరైందేనని టీమిండియా బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్‌లో భువనేశ్వర్ ఒక వైడ్ మినహా మెయిడెన్ వేశాడు. ఇక రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ తన తొలి బంతికే బాబర్ ఆజంను పెవిలియన్ చేర్చాడు. అర్షదీప్ వేసిన ఇన్‌స్వింగర్ బాబర్ ప్యాడ్లను తాకుతు వెళ్లింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఎల్బీకీ అప్పీల్ చేశారు. అంపైర్ ఔటివ్వగా బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు క్లియర్‌గా కనిపించడంతో రివ్యూ వ్యర్థమయింది. దీంతో బాబర్ ఆజం తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇక గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇదే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అప్పటి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు షాహిన్ అఫ్రిది రోహిత్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. తాజాగా బాబర్ కూడా అదే తరహాలో ఔట్ కావడంతో రోహిత్ శర్మ సంతోషంలో మునిగిపోయాడు. ఇక అభిమానులు మాత్రం అప్పుడే పాక్ ఆటపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు రోహిత్.. ఇప్పుడు బాబర్ ఆజం గోల్డెన్ డక్.. లెక్క సరిపోయింది అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: T20 WC Ind Vs Pak: రిజ్వాన్ (4) ఔట్.. అర్ష్‌దీప్‌కు రెండో వికెట్
Comments
Please login to add a commentAdd a comment