ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. బంతిని అంచనా వేయడంలో పొరబడిన రాహుల్ వికెట్ల మీదకు ఆడుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్బాలు పలికిన కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్తాన్ అరంగేట్ర బౌలర్ నసీమ్ షా వేసిన తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ల మీదకు ఆడుకొని క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
టి20 క్రికెట్‌లో డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న నసీమ్ షాకు ఇదే మొయిడెన్ వికెట్. ఇక రాహుల్ ఔటైన విధానం చూస్తే గతేడాది టీ20 ప్రపంచకప్ లో షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన సీన్ మరోసారి కనిపించింది. అప్పుడు కూడా రాహుల్.. 8 బంతులాడి 3 పరుగులే చేసి అఫ్రిది బౌలింగ్‌లో అచ్చం అదే తరహాలో బౌల్డ్ అయ్యాడు. తాజా మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ తొలి బంతికే వెనుదిరిగాడు. ప్రస్తుతం రాహుల్ ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kl Rahul duck 😂 I have already predicted this. #INDvsPAK #AsiaCup2022 #IndiaVsPakistan pic.twitter.com/H7Nstgjlt6
— Dhriti banerjee (@dhriti908) August 28, 2022
చదవండి: IND Vs PAK Asia Cup 2022: టీమిండియా పేసర్ల సరికొత్త రికార్డు.. టి20 క్రికెట్‌లో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment