ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. స్మిత్‌కు ఇది 25 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
స్మిత్ చివరగా 2023 జూన్‌లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై చివరి సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత మూడెంకెల స్కోర్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మిత్‌కు ఇది భారత్‌పై 10వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 33వ టెస్టు సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
స్మిత్ అరుదైన రికార్డులు..
టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ స్టార్ జోరూట్ రికార్డును స్మిత్ సమం చేశాడు. రూట్ 55 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు నమోదు చేయగా... స్మిత్ 41 ఇన్నింగ్స్‌లలో పది శతకాలు సాధించాడు.
అదే విధంగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్ధానానికి స్మిత్(33) ఎగబాకాడు. ఈ క్రమంలో మార్క్ వా(32)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పదకుండో స్ధానంలో స్మిత్(33) కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్(32)ను స్మిత్ వెనక్కి నెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment