
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన మొదటి సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో హ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. దీంతో ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటికి తమ బౌలర్లు అద్భుతంగా పోరాడరని స్మిత్ కొనియాడాడు.
"ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. విజయం కోసం చివరివరకు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకొచ్చారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంతసులువు కాదు. ఆరంభంలో పరుగులు సాధించడం, స్టైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైంది.
మా జట్టులోని ప్రతీ ఒక్కరూ విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డారు. పిచ్ మేము ఊహించినదాని కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ వికెట్‌కు కొంతవరకు స్పిన్నర్లకు బాగానే అనుకూలించింది. స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ అయ్యింది. పేసర్లకు కూడా కొంచెం కష్టంగానే ఉంది.
దుబాయ్ వికెట్ కొంచెం గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోర్లు ఈ వికెట్‌పై సాధించలేకపోతున్నారు. మేము కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మాక్స్‌వెల్ కూడా తన వికెట్‌ను కోల్పోయాడు. అక్కడే మేము రిథమ్‌ను కోల్పోయాము. మేం 280 పైగా రన్స్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఉండింటే మేము అనుకున్న లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం.
అప్పుడు ప్రత్యర్ధిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణించారు. ముఖ్యంగా మా బౌలింగ్ ఎటాక్‌లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికి టోర్నీ ఆసాంతం వారు అద్బుతంగా రాణించారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కూడా చేధించాము. మా జట్టులోని కొంతమంది కుర్రాళ్లు భవిష్యత్తులో కచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లగా ఎదుగుతారు" అని స్మిత్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment