ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన వన్డే వరల్డ్‌కప్ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. వన్డే ప్రపంచపకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. తొలి ఐదు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరంగా ఉన్న హెడ్‌కు.. కివీస్‌తో మ్యాచ్‌లో మాత్రం చోటు దక్కింది. తన వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
కివీస్ బౌలర్లను హెడ్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లోనే హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇక తన తొలి వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా వన్డే ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో ఆసీస్ క్రికెటర్‌గా హెడ్ నిలిచాడు.
చదవండి: WC 2023: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు?
Comments
Please login to add a commentAdd a comment