శుభవార్త చెప్పిన స్టార్‌ క్రికెటర్‌ | Kane Williamson And His Wife Sarah Raheem Welcome Their Third Child Baby Girl, Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Kane Williamson Baby Girl 1st Photo: శుభవార్త చెప్పిన స్టార్‌ క్రికెటర్‌.. బేబీ ఫేస్‌ రివీల్‌

Published Wed, Feb 28 2024 11:03 AM | Last Updated on Wed, Feb 28 2024 11:57 AM

Kane Williamson Sarah Raheem Welcome Baby Girl Their Third Child - Sakshi

న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌, దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విలియమ్సన్‌ తెలిపాడు.

తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ.. చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఇప్పుడిక ముగ్గురు.. ఈ ప్రపంచంలోకి వచ్చే క్రమంలో సురక్షితంగా నీ ప్రయాణం సాగినందుకు సంతోషం. అందమైన చిన్నారికి స్వాగతం’’ అని కేన్‌ విలియమ్సన్‌ కూతురి ఆగమనాన్ని తెలిపాడు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సహ సహచర క్రికెటర్ల నుంచి విలియమ్సన్‌- సారాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  కాగా 2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్‌ విలియమ్సన్‌- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది.

ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు. ఇక మూడో సంతానంగా వీరికి తాజాగా మరో కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైన కేన్‌ విలియమ్సన్‌ టెస్టు సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గురువారం నుంచి ఆసీస్‌తో మొదలుకానున్న తొలి టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నాడు.

చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement