Sarah
-
శుభవార్త చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విలియమ్సన్ తెలిపాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ.. చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఇప్పుడిక ముగ్గురు.. ఈ ప్రపంచంలోకి వచ్చే క్రమంలో సురక్షితంగా నీ ప్రయాణం సాగినందుకు సంతోషం. అందమైన చిన్నారికి స్వాగతం’’ అని కేన్ విలియమ్సన్ కూతురి ఆగమనాన్ని తెలిపాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహ సహచర క్రికెటర్ల నుంచి విలియమ్సన్- సారాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్ విలియమ్సన్- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు. ఇక మూడో సంతానంగా వీరికి తాజాగా మరో కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ టెస్టు సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గురువారం నుంచి ఆసీస్‌తో మొదలుకానున్న తొలి టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నాడు. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) -
కాటేసిన కల్తీసారా.. 12 మంది మృతి.. పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
రాష్ట్రంలో మళ్లీ కల్తీ సారా పేదలను కాటేసింది. మరక్కానం సమీపంలోని జాలర్ల గ్రామంలో విక్రయిస్తున్న కాల్తీసార తాగి ఐదుగురు జాలర్లు విగత జీవులయ్యారు. 17 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. పది లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషి యా ప్రకటించారు. ఇక చెంగల్పట్టు జిల్లాలో మరో నలుగురు రోజువారీ కూలీలు కల్తీ మద్యం తాగి మరణించారు. సాక్షి, చైన్నె: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో కల్తీసారా విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో విల్లుపురం జిల్లా పరిధిలోని సముద్ర తీర గ్రామాలలో సారా విక్రయాలు పెద్దఎత్తున సాగుతున్నట్లు గత కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా కొందరు పోలీసుల నిర్లక్ష్యానికి కల్తీ సారా తాగి ఐదుగురు జాలర్లు మరణించారు. వివరాలు.. విల్లుపురం జిల్లా మరక్కానం పరిధిలోని ఎక్కియార్ కుప్పం సముద్ర తీరంలోని అంబా మేడు పరిసరాల్లో పుదుచ్చేరి నుంచి సారా తీసుకొచ్చి మరీ విక్రయిస్తున్నారు. అదే ప్రాంతంలోకి మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన అమరన్(25) ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో శనివారం రాత్రి ఇతడు అమ్మిన సారాను పదుల సంఖ్యలో జాలర్లు తాగారు. రాత్రి సమయంలో ఎక్కియార్‌కుప్పం గ్రామానికి చెందిన శంకర్(55), ధరణి వేల్(50), సురేష్(60), ఇంద్రన్(61)తో పాటు ఆరుగురు పూటుగా కల్తీ సారా తాగి ఇళ్లకు చేరుకున్నారు. కాసేపటికి కడుపు నొప్పి, వంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని అర్థరాత్రి వేళ పుదుచ్చేరి జిప్మర్కు తరలించారు. వీరంతా కల్తీ సారా సేవించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. అదే సమయంలో చికిత్స పొందుతూ శంకర్, సురేష్, ధరణి వేల్ మరణించారు. ఆందోళనతో ఉద్రిక్తత.. కల్తీ సారా తాగి ముగ్గురు మరణించారనే సమాచారంతో విల్లుపురం జిల్లా యంత్రాంగం కదిలింది. అంబా మేడు పరిఽధిలో సారా పూటుగా తాగి అపస్మారక స్థితిలో పడివున్న వారిని గుర్తించి చికిత్స నిమిత్తం మరాక్కానం, ముండియంబాక్కం ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పళణి, ఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కల్తీ సారా విక్రయదారులను అరెస్టు చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం జాలర్ల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సారా విక్రయదారుడు అమరన్‌ను అరెస్టు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో జాలర్లు ఆందోళన విరమించారు. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మరో ఇద్దరు మధ్యాహ్నం మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇక చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరి పరిస్థితి ఆందోళనకకరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అధికారులపై వేటు మళ్లీ సారా సంస్కృతి తెర మీదకు రావడం, నలుగురు మరణించడంతో ప్రభుత్లంపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వతీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి వంటి మత్తు పదార్థాలు లభ్యమవుతూ వచ్చాయని, ఇప్పుడు సారా సంస్కృతి కూడా మళ్లీ తెర మీదకు వచ్చి నలుగురు బలికావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనను సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. డీజీపీ శైలేంద్రబాబుతో ఈ విషయంపై చర్చించారు. డీజీపీ ఆదేశాలతో మరక్కానం ఇన్స్పెక్టర్ అరుల్ వడివళగన్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ దీపన్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ మరియా సోఫి మంజుల, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శివగురునాథన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ తన సానుభూతి తెలియజేశారు. అలాగే తలా రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సారా రక్కసి నలుగురిని బలి కొనడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సారా తయారీ కేంద్రాలపై దృష్టి సారించారు. -
మన వంటింటి గరిట పట్టుకున్న విదేశీ భామ
సౌకుమార్యమే అక్కడ ప్రధాన అడుగు. జిగేల్మనే కాంతుల మధ్య మెరవడమే అసలైన లక్ష్యం. అలాంటి చోట తనను తాను నిరూపించుకుంది సారాటాడ్. మోడలింగ్‌లో విజయవంతంగా ఎదిగిన ఈ విదేశీయురాలు ఇప్పుడు మన భారతీయ వంటింటి మహారాణిగా వెలుగొందుతోంది. ఇక్కడి ప్రాంతీయ వంటకాలు ‘మహాభేష్’ అంటూ మాస్టర్ చెఫ్‌గా రాణిస్తోంది. విదేశీయురాలు.. అందులోనూ మోడల్. భారతీయ ఆహారం పట్ల మక్కువ పెంచుకోవడమే కాకుండా ఆ వంటల్లో ప్రావీణ్యం సంపాదించాలనుకోవడం సాధారణ విషయమేమీ కాదు. సారాటాడ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నివాసి. 18 సంవత్సరాల వయస్సులో, మోడలింగ్ కోసం సిడ్నీకి వెళ్లింది. మోడలింగ్‌లో సక్సెస్ సాధించింది. ఐదేళ్లుగా సెలబ్రిటీ చెఫ్‌గా ప్రసిద్ది చెందింది. భారతీయ వంటకాల పట్ల మక్కువ పెంచుకుంది. పాకశాస్త్ర ప్రావీణ్యం సాధించింది. మాస్టర్ ఛెఫ్‌గా గోవాలో తన మొదటి రెస్టారెంట్ ప్రారంభించి భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది. పదార్థాలను తెలుసుకుంటూ.. భారతీయ వంటకాల గురించి సారా మాట్లాడుతూ– ‘ఇక్కడ ప్రతీ రాష్ట్రానికి, గ్రామీణ ప్రాంతాల ఆహారానికీ సొంత ప్రత్యేకత ఉంది. నేను అస్సాం నుండి కాశ్మీర్– గోవాకు ప్రయాణిస్తున్న ప్రతిసారీ, ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, పద్ధతులను చాలా దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. వాటిని నేను తీసుకునే ఆహారంలో ఉపయోగిస్తుంటాను. భారతదేశం వైవిధ్యభరితమైనది. ఇక్కడే ఉంటూ ప్రాంతీయ వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, ఎంతో మందికి వాటిని పంచాలనుకుంటున్నాను. ఈ విధానం ద్వారా ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, ఆహార సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎంతో తెలుసుకోవచ్చు’ అని వివరించింది సారాటాడ్. అపోహలు తొలగించాలి ఈ మాస్టర్ చెఫ్ గోవా తర్వాత మరో రెస్టారెంట్‌ను ఢిల్లీలో ప్రారంభించాలనుకుంటోంది. భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలని కోరుకుంటున్నట్టుగా చెబుతోంది. ‘భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే, అది హోటళ్లలో వండినది. కానీ భారతీయుల ఇళ్లలో తింటున్న ఆహారం గురించి విదేశీయులకు అంతగా తెలియదు. యోగా పద్ధతులు, ఆయుర్వేద వంటకాలకు ప్రసిద్ధి ఈ దేశం. ఆరోగ్య దృక్పథం నుండి చూస్తే ఈ ఆహారం అత్యంత ఉత్తమమైనది, శక్తిమంతమైనది. భారతీయ ఆహారం నా వంట శైలిని పూర్తిగా మార్చివేసింది. ఈ ఆహారంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వాసన, రుచి ప్రత్యేకమైనవి. ఈ సుగంధ ద్రవ్యాలు లేకుండా నేను ఏ వంటకాన్నీ వండలేకపోతున్నాను. అంతగా వీటితో మమేకం అయ్యాను’ అని తెలిపింది సారాటాడ్. అంతేకాదు, విదేశాలలో భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలనుకుంటున్నట్టుగా కూడా చెబుతోంది. ఏమైనా మన దేశీయ వంటగది, అందులో వండే వంటకాలు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో.. వాటి పట్ల విదేశీయులు ఎంత ఆసక్తిని చూపుతారని సారాటాడ్ని కలిస్తే తెలిసిపోతుంది. విదేశీయురాలై ఉండి భారతీయ వంటకాలను ప్రేమగా నేర్చుకుంటున్న సారాటాడ్ లాంటి వాళ్లను చూస్తే ఇక్కడి యువత మన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొంతైనా తప్పక వంటబట్టించుకుంటారు. -
సెనెటర్ శారమ్మ
ఇంకా సెనెటర్ కాలేదు. కానీ అయ్యేలా ఉన్నారు. అవుతారు కూడా. మంచికోసం పోరాడాలి. మంచి దారిలో పెట్టాలి. మంచికి తోడు అవ్వాలి. ఇన్ని హోప్స్ ఉన్నాయి... ఒబామాకు శారా మీద. ఆ ఆశలే ఆమె గెలుపు. గొప్పగా అనిపిస్తుంది.. ఇక్కడి వాళ్లు ఎక్కడికో వెళ్లి అక్కడి రాజకీయాల్లో ప్రముఖులు అయిపోవడం. పారిశ్రామికవేత్తలైతే ‘తెలివుంది కనుక’ అనుకోవచ్చు. నటీనటులైతే ‘టాలెంట్ ఉంది కనుక’ అనుకోవచ్చు. ఇంకా ఏ రంగానికి ఆ రంగంలో ఎవరికి వారు కష్టపడితే సుప్రసిద్ధ ఎన్నారైలు అయిపోవచ్చు. కానీ మనవాళ్లు పాలకులుగా కూడా ఎదుగుతున్నారే! అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాలలో!! ప్రజలు ఎన్నుకుంటేనే ఎక్కడైనా సభల్లోకి ప్రవేశం. మరి భారతీయులు.. దేశంకాని దేశంలో.. ఎలా చట్టసభల ప్రతినిధులు అవుతున్నారు? ఎలా అంటే.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి. అక్కడి ప్రజలకు సేవలు అందించి, సదుపాయాలను కల్పించి! వ్యాపారికి తెలివి, నటులకు టాలెంట్.. ఉన్నట్లే.. రాజకీయంగా ‘నాయకత్వ సమర్థత’ మనవాళ్లను నిలబెడుతోంది. యు.ఎస్.లోని మైన్ రాష్ట అసెంబ్లీకి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న 48 ఏళ్ల శారా గిడియన్.. మన భారతీయ సంతతి మహిళే. ఇప్పుడామె ఆ పై స్థానానికి పోటీ చేయబోతున్నారు. అమెరికన్ ‘సెనెటర్’గా! సెనెటర్‌గా శారా అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం మద్దతు ఇవ్వగానే (‘ఎండార్స్’ అంటారు ఇలా మద్దతు ఇవ్వడాన్ని) వెనువెంటనే ఆమె తరఫున పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆమె కొత్తగా ప్రచారం గానీ, పరిచయం కానీ చేసుకోవలసిందేమీ లేదు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడన్ కూడా శారాకు మద్దతు పలికారు. ఇద్దరు దిగ్గజాలు ఇటొకరు, అటొకరు ఉండి (ఒబామా, బైడన్) శారాను సెనెట్‌కు పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె పని తీరు మీద వారికున్న నమ్మకం, విశ్వాసం అది. 2012 లో మైన్ అసెంబ్లీలో దిగువ సభకు ఎన్నికయ్యారు శారా. అది ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం. తర్వాత 2016లో అదే సభకు స్పీకర్ అయ్యారు. ఇప్పుడు మైన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ వెళ్లేందుకు.. ప్రస్తుతం ఇదే రాష్ట్రం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా సెనెట్‌లో ఉండి, మళ్లీ పోటీ పడుతున్న సీనియర్ సెనెటర్ 67 ఏళ్ల సుజేన్ కాలిన్స్‌ను డీకొనబోతున్నారు! ఆమెపై గెలిస్తే అమెరికన్ సెనెట్‌లో శారా రెండో భారతీయ సంతతి సభ్యురాలు అవడం అటుంచి, సుజేన్పై గెలవడం పెద్ద విషయం అవుతుంది. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న రోజే అమెరికన్ సెనెట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సభ్యులకు ఆరేళ్ల పదవీ కాలం ఉండే సెనెట్.. ప్రతి ‘సరి’ సంవత్సరంలో ఎన్నికలకు వెళుతుంది. శారా తండ్రి ఇండియా నుంచి వెళ్లి యు.ఎస్.లోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో స్థిరపడిన పిల్లల వైద్యుడు. నలుగురు పిల్లల్లో శారా ఆఖరి సంతానం. రోడ్ ఐలాండ్‌లోనే పెరిగింది. శారా తల్లి రెండో తరం ఆర్మేనియన్ సంతతి మహిళ. శారా అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ చేశారు. చదువు అయ్యాక ఓ సెనెటర్ దగ్గర ఇంటెర్న్‌గా ఉన్నారు. తర్వాత మైన్స్టేట్లోని ఫ్రీపోర్ట్ టౌన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు! అరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పోలిస్ సంస్కరణలు, తుపాకీ సంస్కృతి నియంత్రణ.. వీటికోసం శారా చాలా కృషి చేశారు. ఇలాంటి వారు సెనెట్‌లో ఉంటే అమెరికాకు మంచి జరుగుతుందని ఒబామా తన ఎండార్స్మెంట్లో రాశారు. శారా సెనెటర్‌గా ఎన్నికైతే కమలా హ్యారిస్ తర్వాత సెనెటర్ అయిన రెండో భారత సంతతి మహిళ అవుతారు. శారా భర్త, ఆమె ముగ్గురు పిల్లలు ఫ్రీపోర్ట్లో నివాసం ఉంటారు. భర్త బెంజమిన్ లాయర్. భర్త, పిల్లలతో శారా -
మొలాసిస్తో సారా తయారీ లేదు..
సాక్షి, హైదరాబాద్: మొలాసిస్తో సారా కాయటం అన్నది ఎక్సైజ్ చరిత్రలో ఇప్పటివరకు లేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. ‘నాటుసారాకు కొత్త రెక్కలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. 2016 అక్టోబర్ నాటికే తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేశామంటూ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సుజ్ఞానపురంలో మాత్రమే 27 టన్నుల చక్కెర నిల్వలు పట్టుకున్నామని, నిరంతర నిఘాతో గుడుంబాను నియంత్రించామన్నారు. చక్కెర కర్మాగారాల నుంచి మొలాసిస్ బయటికి రావాలంటే ఎక్సైజ్ డీసీ అనుమతి తప్పనిసరని వివరించారు. రాష్ట్రంలో గుడుంబా నియంత్రణ కోసం ఇప్పటివరకు 94 పీడీ యాక్టు కేసులు, బైండోవర్లు పెట్టడం జరిగిందన్నారు. -
కర్నూలు జిల్లాలో నాటుసారా గొడవ
-
పెళ్లి చేసుకో.. లేదంటే కిడ్నాప్ చేస్తా!
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాను వేధిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. నిందితుడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన దేవ్ కుమార్(32)గా గుర్తించారు. సచిన్ ఇంటి ల్యాండ్‌లైన్ నంబర్‌ను ఎలాగో సంపాదించిన దుండగుడు.. గత కొద్ది రోజులుగా ఫోన్ చేసి సారాను వేధిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు తనను పెళ్లి చేసుకోకుంటే కిడ్నాప్ చేస్తానని సారాను బెదిరించాడన్నారు. ఈ విషయమై ముంబైలోని బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో సచిన్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో కోల్‌కతా పోలీసుల సాయంతో ఫోన్ ట్రేస్ చేసి కుమార్‌ను పట్టుకున్నామన్నారు. ‘ఓ మ్యాచ్‌లో పెవిలియన్‌లో కూర్చుని ఉన్న ఆమె(సారా)ను టీవీలో చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయా. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెతో మాట్లాడేందుకు వాళ్లింటికి 20 సార్లు ఫోన్ చేసుంటా’ అని కుమార్ పోలీసులకు తెలిపాడు. కుమార్‌కు మతిస్థిమితం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. -
హమ్మయ్య.. భారత చిన్నారి దొరికింది
మనామా: బహ్రెయిన్ లో భారత బాలిక కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఐదేళ్ల సారా ను కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు విడిపించడంతో 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం రాత్రి హూరా ప్రాంతంలో చిన్నారిని కిడ్నాప్ చేశారు. సారాను కారులో ఉంచి తల్లి మంచినీళ్ల బాటిల్ కొనుక్కురావడానికి వెళ్లగా దుండగులు కారుతో పాటు చిన్నారిని ఎత్తుకుపోయారు. సారా తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పాపను విడిపించారు. నిందితులు బహ్రెయిన్ వ్యక్తి(38), ఆసియా మహిళ(37)గా వెల్లడించారు. వారి పేర్లు చెప్పలేదు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిచామని, 25 పహారా వాహనాలను రంగంలోకి దింపి కిడ్నాపర్లను పట్టుకున్నామని కాపిటల్ గవర్నేట్ పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది తెలిపారు. హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించామని చెప్పారు. సారాకు ఎటువంటి ముప్పు తలపెట్టలేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఆమె మేనమామ అనిశ్ చార్లెస్ తెలిపాడు. హూరా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి పాపను తమకు అప్పగించారని చెప్పారు. తల్లిని చూడగానే సారా పరిగెత్తుకుని వెళ్లి ఆమెను అమాంతంగా కౌగిలించుకుంది. కూతుర్ని తల్లి గుండెలకు హత్తుకున్న దృశ్యాలు అక్కడున్న వారిని కదిలించాయి. సారా కిడ్నాప్ వెనుక ఆమె తండ్రి హస్తం ఉందని అనీశ్ చార్లెస్ అనుమానం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న సారా తండ్రి ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. వీరిద్దరికీ సారా ఒక్కతే సంతానం. కాగా, సారా కిడ్నాప్ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. చిన్నారిని సురక్షితంగా విడిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
భారత్ అబ్బాయి.. బెల్జియం అమ్మాయి.. ఓ చిక్కు
నమక్కల్: ఇద్దరిది వేర్వేరు దేశాలు..అయితేనేం ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులను కూడా ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ మన నిబంధనలు వారి వివాహాన్ని ఆమోదించక పోవడంతో ప్రస్తుతం వారిద్దరు ఆందోళనలో ఉన్నారు. తమిళనాడులోని నమక్కల్ దగ్గర్లోని కొళ్లి హిల్స్‌కు చెందిన గిరిజన యువకుడు సురేష్ కుమార్ (28) షిప్ లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. తన కన్నా వయసులో రెండేళ్లు పెద్దదైన బెల్జియం యువతి సారాని....అతడు మొదటిసారి షిప్లో చూశాడు. తొలి చూపులోనే వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులను కూడా వారి వివాహానికి ఒప్పుకునేలా చేశారు. కొళ్లి హిల్స్ లోని వినాయకుడి ఆలయంలో సోమవారం సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహమైంది. అయితే వీరిద్దరూ కలిసి ఉండేందుకు మాత్రం ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి. సారా విదేశీయురాలు కావడంతో పెళ్లి రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. సారా విదేశీ యువతి కావడం వల్ల ధ్రువపత్రం ఇవ్వడం కుదరదని అభ్యంతరం తెలిపారు. ' పెళ్లి రిజిస్ట్రేషన్ అయ్యి...మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తేనే సారాకు లాంగ్ టర్మ్ వీసా వస్తుంది. అప్పుడే తను నాతో కలిసి ఇక్కడే జీవితాన్ని ప్రారంభించే అవకాశం లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆమె వీసా గడువు ముగుస్తుంది. కాబట్టి సారా బెల్జియం తిరిగా వెళ్లాల్సి ఉంటుంది' అని సురేష్ వాపోయాడు. సారాకి భారతీయ సంస్కృతి అన్నా, ఇక్కడి విలువలన్నా చాలా ఇష్టమని అతడు తెలిపాడు. -
వారి బాటలోనే కేసీఆర్ సర్కార్
ఆదివాసీల హక్కుల పరిరక్షణలో సర్కారు విఫలం సారాకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి పీవైఎల్ సభలో సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత ప్రభుత్వాల బాటలోనే కేసీఆర్ సర్కార్ పయనిస్తోందని సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. 3 రోజులపాటు ఖమ్మంలో జరిగే పీవైఎల్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా తొలిరోజు సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆశించారని, పేదలకు చేతినిండా పని, కడుపు నిండా భోజనం లభించని దుస్థితి ఉందన్నారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించకపోవడం వారి చేత వెట్టి చాకిరీ చేయించుకున్నట్లే అవుతోందన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఆదివాసీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ప్రజల చేత ప్రభుత్వాలు బలవంతంగా తాగిస్తున్న సారాయికి వ్యతిరేకంగా మహిళలు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సైతం ప్రజల పక్షాన నిలవడం లేదని, కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలవరం ఆదివాసీలను ముంచే ప్రాజెక్టని, దీనిపై ప్రభుత్వాలు పట్టుదలకు వెళ్తున్నాయి... తప్ప ఆదివాసీల మనుగడను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. . బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమకారులను మట్టుపెట్టే పరిస్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. సభలో తెలంగాణ జేఏసీ కో-చైర్మన్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్ ఎ.రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, బయ్యారం జెడ్పీటీసీ గౌని ఐలయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి ముక్తార్‌పాషా, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండలి వెంకన్న పాల్గొన్నారు. -
పల్లెల్లో సారా ఘాటు
పాలసముద్రం : మండలంలోని అనేక గ్రామాలు సారా కంపుకొడుతున్నాయి. నరసింహపురం, అయ్యవారికండ్రిగ, గంగమాంబ పురం, కోద ండరామపురం గ్రామాల్లోని కొండల్లో స్థావరాలు ఏర్పా టు చేసుకుని సారా తయారు చేస్తున్నా రు. అక్కడ తయారైన సారాను పాలసముద్రం, కేజేపురం, తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో పదికి పైగా సారా బట్టీలు ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని గ్రామాల్లో సారా ఉత్పత్తినే కుటీర పరిశ్రమగా చేసుకున్నారంటే పరి స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాంతక రసాయనాలతో అధిక కిక్.. మత్తు ఎక్కువ ఉండాలని వ్యాపారులు సారాలో నవసాగ్రం, ప్లాస్టిక్ వస్తువులు, బ్యాటరీ సెల్స్, వివిధ ప్రాణాంతక రసాయనిక పదార్థాలు కలుపుతున్నారు. ఇది తాగితే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. నాటుసారా తాగి గతంలో కొందరు మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వేలాది కుటుంబాలు వీధుల పాలయ్యాయి. అధికారులకు నెల నెలా మామూళ్లు అందుతుండడంతో పట్టి ంచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తుల సంచారం. మండలంలో సారా విక్రయాలు జోరుగా సాగుతుండడంతో గుర్తు తెలియని వ్యక్తులు సైతం ఇక్కడికొచ్చి సారా తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుండడంతో మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గంజాయిలో యువత చి(మ)త్తు
సాక్షి, కడప : మద్యం, సారా, కొకైన్, గంజాయి, స్పిరిట్ ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత. అయితే ఎన్ని కిక్కిచ్చే లెసైన్సు మందులు ఎన్ని వస్తున్నా గంజాయిపై యువత కన్ను పడింది. గంజాయి మత్తునుగమ్మత్తుగా భావించిన కొంతమంది విద్యార్థులు గంజారుుని భారీగా కొనుగోలు చేస్తున్నారు. అదెక్కడో మారుమూల ప్రాంతం కాదు.... జిల్లా కేంద్రమైన కడపలోని కొన్ని ప్రాంతాల్లో యథేచ్చగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నా పట్టించుకోకపోవడం విస్మయం కలిగించే అంశం. గంజారుు అమ్మకాలు కొంతమంది మహిళలే నిర్వహిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. సాక్షి బహిర్గతం చేసిందిలా... కడపలోని కడప-మాచుపల్లె ప్రధాన రహదారిలోని మాసాపేటలో కొన్నిచోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు తెలుసుకున్న సాక్షి నిఘా బృందం దృష్టి సారించింది. ఆ ప్రాంతానికి వెళ్లి గంజాయి ప్యాకెట్ కావాలని కోరగా, మేము అమ్ముతున్నామని ఎవరు చెప్పారు? అసలు అమ్మేవారు ఇక్కడ ఎవరూ లేరంటూ బుకాయించారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దబారుుంచారు. అనంతరం చిన్నగా స్థానికులతో మాటలు కలపగా ఎట్టకేలకు గంజారుు అమ్మకాల విషయం నిజమని తేలింది. శ్మశాన సమీపంలోని ప్రాంతంలో కొంతమంది మహిళలు గోప్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. బైకులో వచ్చిన వారు ముందుగా గంజాయి విక్రయించే ప్రాంతం వద్ద డబ్బులిచ్చి వాహనంలో ముందుకు వెళతారు. తర్వాత మళ్లీ రెండు నిమిషాలకు వెనక్కి బైకులో వస్తూ స్లో చేయగానే విక్రయించే వారు వచ్చి చేతిలో ప్యాకెట్ పెడతారు. ఇలా గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. పైగా ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకెట్లు చేతులు మారుతున్నాయి. ఒక్కొ ప్యాకెట్ రూ.50 ఒక చిన్న కాగితంలో చుట్టి ఉంచిన గంజాయిని రూ. 50 చొప్పున... అందులోనూ పరిచయం ఉండి నమ్మకం కలిగిన వారికి మాత్రమే విక్రరుుస్తున్నారు. ఒక మాసాపేట ఏరియాలోనే కాకుండా ఎర్రముక్కపల్లె, తిలక్‌నగర్, రైల్వేస్టేషన్, ఎన్టీఆర్ నగర్, ప్రొద్దుటూరు, రాయచోటిలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు ప్రభుత్వానికి పలునిఘా సంస్థలు కూడా తెలియజేసినట్లు సమాచారం. గంజాయికి ఆకర్శితులవుతున్న యువత కడపలోని పలు ప్రాంతాలలో గంజాయి ప్యాకెట్లను యువత కొనుగోలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు మరికొంతమంది ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. శని, ఆదివారాల సమయంలో గంజారుు అమ్మకాలు జోరుగా సాగుతున్నారుు. యువత పెడద్రోవ పడుతున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి సారించి కట్టడి చేయకపోతే పరిస్థితులు చేయి దాటిపోయేటట్లు కనిపిస్తున్నాయని పలువురు సూచిస్తున్నారు. కేసులు అంతంత మాత్రంగానే..... జిల్లాలో పరిస్థితులను గమనిస్తే కేసులు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కడపలో బహిరంగంగా విక్రయాలు జరుగుతున్నా....పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గంజాయిపై నిఘా ఉంచాం! - అశోక్‌కుమార్ గంజాయి అక్కడక్కడా విక్రయాలు సాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని....అందుకు సంబంధించి ఇప్పటికే నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడించారు. రాత్రి సమయాల్లో కూడా అనుమానం ఉన్నచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. విక్రయదారులతోపాటు అమ్మకాలకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మన‘సారా’ మద్యం బంద్
సారా, మద్యం మహిళల పాలిట మహమ్మారిలా దాపురించాయి. మద్యానికి బానిసైన భర్త బాధ్యతలు మరిస్తే కుటుంబ భారాన్ని భార్య తలకెత్తుకుంటోంది. తాగి తాగి మొగుడు అనారోగ్యం పాలై మరణిస్తే ఒంటరిగా సంసార సాగరాన్ని ఈదేందుకు ఇబ్బందులు పడుతోంది. మహిళల జీవితాలతో ఇంతలా చెలగాటమాడుతున్న మద్యం మహమ్మారిని మరెవరో వచ్చి తరిమేస్తే బావుండని చాలామంది అనుకుంటుంటారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని పిడికిళ్లు బిగించి సమర భేరీ మోగించారు. ‘సారా ప్రపంచాన్ని’ తరిమికొట్టారు. మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. కోరుట్ల/ఎల్లారెడ్డిపేట/చందుర్తి/కోనరావుపేట:చందుర్తి మండలం నర్సింగపూర్‌లో మద్యం, సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యువకులతో పాటు చాలామంది తాగుడుకు బానిసలవుతున్నారు. ఫలితంగా పచ్చని కాపురాల్లో చిచ్చురగులుతోంది. యువకులు అనారోగ్యాల బారినపడి ఆసుపత్రుల పాలువుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామంలో వివాదాస్పద సంఘటనలు ఎక్కువయ్యాయి. నిత్యం గొడవలు.. పోలీసు కేసులు. వీటన్నింటికి మద్యం, సారాలే కారణమని గుర్తించిన స్వశక్తి సంఘాల మహిళలు.. వాటిని నిషేధించడమే మార్గమని తలచారు. సోమవారం గ్రామంలోని 39 స్వశక్తి సంఘాల సభ్యులందరు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. గ్రామ పెద్దలను, పంచాయతీ పాలకవర్గాన్ని అక్కడికే పిలిచారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు. వెంటనే బెల్టుషాపుల నిర్వాహకులను, గుడుంబా అమ్మకందారులను పిలిచి దుకాణాలు ఎత్తివేయాలని హెచ్చరించారు. తమ సంకల్పానికి సహకరించాలని కోరుతూ ఎక్సైజ్, పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు శభాష్ అంటూ అభినందించారు. ఫలితంగా ఐదు రోజులు గా గ్రామంలో బెల్ట్‌షాపులు, గుడుంబా కేంద్రాలు మూతబడ్డాయి. మొన్నటిదాకా అల్లకల్లోలంగా ఉన్న గ్రామంలో నేడు ప్రశాంత వాతావరణం నెలకొంది. అది కోరుట్ల పట్టణ శివారులోని అల్లమయ్యగుట్ట కాలనీ. రోజువారి కూలీచేసి పొట్టపోసుకునే కుటుం బాలే అన్నీ. ఆ కాలనీలో పొద్దస్తమానం కష్టపడి అలసిపోయే వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సారా అమ్మకందారులు తిష్ట వేశారు. వ్యసనానికి బానిసలైన పురుషులు, కొంతమంది మహిళలు పనులు వదిలేసి తాగుడే లోకంగా జీవిస్తున్నారు. ఫలితంగా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడ కూడా నిత్యం గొడవలు, కొట్లాటలు. ఈ పరిస్థితులను చూసి చలిం చిన ఆ కాలనీలోని ఇంద్ర మహిళా సంఘం సారా అమ్మకాలపై తిరగబడింది. కాలనీ పెద్ద మనుషులతో మాట్లాడి అందరితో కలిసి సారా అమ్మకం కేంద్రాలపై మహిళలు దాడులు చేశారు. సారా, గుడుంబా ప్యాకెట్లను ధ్వంసం చేశారు. సారా అమ్మకాలు నిరోధించాలని ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతటితో కాలనీలో దాదాపుగా సారా అమ్మకాలు ఆగిపోయాయి. ఈ సారా వ్యతిరేక ఉద్యమానికి ముందుకొచ్చింది.. నిరక్షరాస్యురాలైన మహిళ బాజ పోశమ్మ. ఆమెతో పాటు ముందుకు కదలారు ఆ కాలనీ మహిళలు. మొత్తం మీద కాలనీలో సారా అమ్మకాలను బంద్ చేయించి తమ సత్తా చాటారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి, వెంకట్రావుపేట, మల్కపేట గ్రామాల్లో మద్యం, సారా జోరుగా సాగేవి. ఈ గ్రామాల్లో కూడా అదే పరిస్థితు లు ఉండేవి. గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పేందుకు సంపూర్ణ మద్య నిషేధాన్ని విధిస్తున్నట్లు మహిళా సం ఘాలు తీర్మానించాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో, ప్రజలతో చర్చించి మద్య నిషేధాన్ని అమలు చేస్తేనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయని వివరిం చారు. అందుకు అందరినీ ఒప్పించి ‘మద్యం, సారా అమ్మం, తాగం’ అని ఒట్టేయించారు. మద్యాన్ని అమ్మినా, తాగినా జరిమానా విధించడంతో పాటు జాడ చెబితే నజరానా చెల్లిస్తామని మహిళా సంఘాలు డప్పు చాటింపు చేయించాయి. తమ గ్రామాల్లో మద్య నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం కోరారు. అంతా కలిసి మద్యం మహమ్మారిని పారద్రోలారు. ఇంతకుముందు లాగా ఇప్పుడు ఆ గ్రామాల్లో గొడవలు లేవు. గతంలో సారాతో కూలిన కుటుంబాలు మళ్లీ నిలబడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, దుమా ల, రాచర్లతిమ్మాపూర్, పదిర గిరిజన గ్రామాలు మద్యం మహమ్మారి, సారా రక్కసి కాటు చవిచూశా యి. ఈ గ్రామాల్లో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలే అన్నీ. భార్యాభర్తలిద్దరు కూలీకి వెళ్తేనే పొట్టగడిచేది. పురుషులు తాము సంపాదించిన డబ్బులను సాయంత్రం కాగానే తాగుడుకు తగలేస్తున్నారు. ఎదుగుతున్న పిల్లలు.. తడిసిమోపడవుతున్న ఖర్చులతో కుటుంబ పోషణ భారం మహిళలపై పడింది. చాలీచాలని తమ రెక్కల కష్టంతో సంసారాన్ని నెట్టుకు రాలేని పరిస్థితి. ఇది చాలదన్నట్టు తాగొచ్చిన భర్త చేతిలో తన్నులు అదనం. వెరసి అతివల వేదన అంతా ఇంతా కాదు. గ్రామాల్లో అధికారుల కనుసన్నల్లో బెల్టుషాపులు వెలిసి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్న క్రమంలో నలిగిపోతున్న మహిళల పరిస్థితులకు చలించిపోయిన మహిళా సంఘాలు, యువజన సంఘాలు మద్యం అమ్మకాలపై కన్నెర్ర చేశాయి. సారా, మద్యం అమ్మకాలపై సమరం సాగించడంతో పాటు అమ్మితే జరిమానా, పట్టిస్తే నజరానా అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకొని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా నారాయణపూర్, దుమాల, రాచర్ల తిమ్మాపూర్, పదిర గ్రామాల్లో ప్రజల సమష్టి నిర్ణయంతో మద్య నిషేధం అమలవుతోంది. -
నాటు ప్రాణాలకు చేటు
సీహెచ్ఎల్ఫురంలో ఒకరి బలి విచ్చలవిడిగా తయారీ, విక్రయాలు అరికట్టాలని కోరుతున్న ప్రజలు మండలంలో పలు గ్రామాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. దీన్ని సేవించి పలువురు అస్వస్తతకు గురవడం, మృత్యువాత పడడం జరుగుతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున చుక్కలవానిలక్ష్మీపురం గ్రామంలో కొండలరావు అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. సారా విపరీతంగా సేవించడం వల్లే తమ సోదరుడు మృత్యువాత పడ్డాడని కొండలరావు సోదరుడు వైఎస్సార్ సీపీ నాయకుడు రాజబాబు, శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. కుటీ ర పరిశ్రమలా సారా తయారీ కుటీర పరిశ్రమగా మారిందని, నిత్యం వందలాది లీటర్ల సారా తయారు చేసి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎక్జైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలు గ్రామానికి పెద్ద తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపులు అరికట్టడంతో సారా తయారీ జోరందుకుంది. ఒక్క సీహెచ్ఎల్పురంలోనే కాదు పెదతీనార్ల, చినతీనార్ల, బోయపాడు, రాజయ్యపేట, డిఎల్ఫురం, చినదొడ్డిగల్లు, గొడిచర్ల, రమణయ్యపేట, రేబాక, చీడిక, దోసలపాడు, గుల్లిపాడు, నెల్లిపూడి, నామవరం, గుంటపల్లి, గునిపూడి గ్రామాల్లో సారా వ్యాపారం జోరుగా జరుగుతోంది. గ్రామాలకు దూరంగా ఉన్న తోటల్లో, కొండగెడ్డల్లో సారా తయారు చేస్తున్నారు. ప్యాకెట్లు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. చౌకగా లభించడంతో మందుబాబులు ఎగబడుతున్నారు. నాణ్యతలేని సారా తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు దృష్టి సారించకపోతే చాలామంది ప్రాణాలు పొగొట్టుకొనే ప్రమాదముందని పలువురు అంటున్నారు. -
సారా అమ్మినా.. తాగినా జరిమానే!
పెద్దేముల్: సారా మహమ్మారిని తరిమికొట్టేందుకు యువకులు నడుం బిగించారు. సారా అమ్మినా.. తాగినా.. జరిమానా తప్పదంటూ హెచ్చరించారు. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ తండాలో చోటుచేసుకుంది. సారా తాగడంతో తండావాసులు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో సారా మహమ్మారిని తరిమివేద్దామని యువకులు ముందుకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 11 వరకు గ్రామంలో విక్రయించేందుకు తెచ్చిన సారాను ధ్వంసం చేశారు. సారా తాగినా.. అ మ్మినా రూ. 10-50 వేల వరకు జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించారు. సారా మహ మ్మారి బారినపడితే అనారోగ్యం పాలవుతారని, ఇల్లు గుల్లవుతుందని ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. దీంతో పాటు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో ఉన్న సారా బట్టీలను ధ్వంసం చేశారు. అనంతరం యువకులు రవినాయ క్, రామునాయక్, చందర్నాయకర్, లచ్యానాయక్, తార్యానాయక్,లక్ష్మణ్‌నాయక్, విఠల్, హీరాసింగ్ తదితరులు సివిల్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎవరూ నడవని బాటలో...
స్ఫూర్తి ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా... ఆడపిల్లలు అనగానే కొన్ని రకాల ఉద్యోగాలు చేస్తేనే బాగుంటుందని తేల్చేస్తారంతా. నాగరికత బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి మాటలు వినిపిస్తాయి. సారాకి ఆ మాటలు అస్సలు నచ్చవు. అందుకే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే వెంటనే ప్రశ్నించేది. ఇవే ఎందుకు చేయాలి? ఇవి ఎందుకు చేయకూడదు? అని నిలదీసేది. ఏదో తెలియక అడుగుతోంది అనుకునేవారు కానీ... నిజంగానే ఎవరూ సాగని బాటలో సాగుతుందని, ఆడపిల్లలు వెళ్లని రంగంలోకి అడుగుపెడుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. అమెరికాకు చెందిన సారా చిన్నతనం నుంచే వైవిధ్యంగా ఆలోచించేది. ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తీసిపోరని ఆమె ఉద్దేశం. అందుకు తగ్గట్టే సాహసాలు చేసేది. మహిళలు నడపడానికే భయపడే పెద్ద పెద్ద వాహనాలను నడపాలని సరదా పడేది. వాటిని నడుపుతున్నప్పుడు బండిలో ఏదైనా లోపం తలెత్తితే దాని గురించి స్టడీ చేసేది. ఆ శ్రద్ధ కాస్తా ఆమెను మెకానిజం వైపు లాక్కెళ్లింది. ఎలాగైనా సరే వాహనాలను బాగు చేయడం నేర్చుకోవాలని నిర్ణయించుంది. సారా నిర్ణయం గురించి విన్న కుటుంబ సభ్యులు... ‘ఆడపిల్లవై ఉండి మెకానిక్‌గా పని చేస్తావా?’ అన్నారు. స్నేహితులు పరిహాసమాడారు. కానీ సారాకి మాత్రం అది జోక్ చేయాల్సిన విషయంలా అనిపించలేదు. అందుకే ఓ ఇన్స్టిట్యూట్లో చేరి కార్ల మెకానిజం నేర్చుకుంది. మెకానిక్ షెడ్ కూడా పెట్టింది. ఆమెను చూసి మొదట నవ్వినవాళ్లు... ఆమె బళ్లను బాగుచేసే తీరు చూసి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆమెను చూసి ఫ్రెండ్స కూడా ఆ పని చేయాలని సరదాపడ్డారు. వాళ్లకు కూడా ఆ పని నేర్పింది సారా. వారితో కలిసి ‘180 డిగ్రీ ఆటోమోటివ్’ అనే సంస్థను స్థాపించింది. కాలం గిర్రున తిరిగింది. సారా పేరు అమెరికా అంతటా పాకిపోయింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ అంటూ దేశమంతా ఆమెను పొగిడింది!