సాక్షి, కడప : మద్యం, సారా, కొకైన్, గంజాయి, స్పిరిట్ ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత. అయితే ఎన్ని కిక్కిచ్చే లెసైన్సు మందులు ఎన్ని వస్తున్నా గంజాయిపై యువత కన్ను పడింది. గంజాయి మత్తునుగమ్మత్తుగా భావించిన కొంతమంది విద్యార్థులు గంజారుుని భారీగా కొనుగోలు చేస్తున్నారు. అదెక్కడో మారుమూల ప్రాంతం కాదు.... జిల్లా కేంద్రమైన కడపలోని కొన్ని ప్రాంతాల్లో యథేచ్చగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నా పట్టించుకోకపోవడం విస్మయం కలిగించే అంశం. గంజారుు అమ్మకాలు కొంతమంది మహిళలే నిర్వహిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
సాక్షి బహిర్గతం చేసిందిలా...
కడపలోని కడప-మాచుపల్లె ప్రధాన రహదారిలోని మాసాపేటలో కొన్నిచోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు తెలుసుకున్న సాక్షి నిఘా బృందం దృష్టి సారించింది. ఆ ప్రాంతానికి వెళ్లి గంజాయి ప్యాకెట్ కావాలని కోరగా, మేము అమ్ముతున్నామని ఎవరు చెప్పారు? అసలు అమ్మేవారు ఇక్కడ ఎవరూ లేరంటూ బుకాయించారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దబారుుంచారు. అనంతరం చిన్నగా స్థానికులతో మాటలు కలపగా ఎట్టకేలకు గంజారుు అమ్మకాల విషయం నిజమని తేలింది.
శ్మశాన సమీపంలోని ప్రాంతంలో కొంతమంది మహిళలు గోప్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. బైకులో వచ్చిన వారు ముందుగా గంజాయి విక్రయించే ప్రాంతం వద్ద డబ్బులిచ్చి వాహనంలో ముందుకు వెళతారు. తర్వాత మళ్లీ రెండు నిమిషాలకు వెనక్కి బైకులో వస్తూ స్లో చేయగానే విక్రయించే వారు వచ్చి చేతిలో ప్యాకెట్ పెడతారు. ఇలా గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. పైగా ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకెట్లు చేతులు మారుతున్నాయి.
ఒక్కొ ప్యాకెట్ రూ.50
ఒక చిన్న కాగితంలో చుట్టి ఉంచిన గంజాయిని రూ. 50 చొప్పున... అందులోనూ పరిచయం ఉండి నమ్మకం కలిగిన వారికి మాత్రమే విక్రరుుస్తున్నారు. ఒక మాసాపేట ఏరియాలోనే కాకుండా ఎర్రముక్కపల్లె, తిలక్‌నగర్, రైల్వేస్టేషన్, ఎన్టీఆర్ నగర్, ప్రొద్దుటూరు, రాయచోటిలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు ప్రభుత్వానికి పలునిఘా సంస్థలు కూడా తెలియజేసినట్లు సమాచారం.
గంజాయికి ఆకర్శితులవుతున్న యువత
కడపలోని పలు ప్రాంతాలలో గంజాయి ప్యాకెట్లను యువత కొనుగోలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు మరికొంతమంది ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. శని, ఆదివారాల సమయంలో గంజారుు అమ్మకాలు జోరుగా సాగుతున్నారుు. యువత పెడద్రోవ పడుతున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి సారించి కట్టడి చేయకపోతే పరిస్థితులు చేయి దాటిపోయేటట్లు కనిపిస్తున్నాయని పలువురు సూచిస్తున్నారు.
కేసులు అంతంత మాత్రంగానే.....
జిల్లాలో పరిస్థితులను గమనిస్తే కేసులు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కడపలో బహిరంగంగా విక్రయాలు జరుగుతున్నా....పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
గంజాయిపై నిఘా ఉంచాం! - అశోక్‌కుమార్
గంజాయి అక్కడక్కడా విక్రయాలు సాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని....అందుకు సంబంధించి ఇప్పటికే నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడించారు. రాత్రి సమయాల్లో కూడా అనుమానం ఉన్నచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. విక్రయదారులతోపాటు అమ్మకాలకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయిలో యువత చి(మ)త్తు
Published Tue, Dec 2 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement