వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తన మొదటి వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనే హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 59 బంతుల్లోనే హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు.
సెంచరీతో చెలరేగిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్ రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు.
చదవండి: WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా అంటే..?
Comments
Please login to add a commentAdd a comment