వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య కివీస్‌తో మూడు టీ20లు, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తాజాగా టెస్టు సిరీస్ జట్టును సైతం వెల్లడించింది. ఈ సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఈ సిరీస్ కోసం పేస్ ఆల్‌రౌండర్ మైఖేల్ నీసర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అదే విధంగా కివీస్ సిరీస్‌లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ వ్యవహరించనుండగా.. పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ స్ధానంలో మాథ్యూ రెన్‌షా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. ఫిబ్రవరి 29 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్లు మధ్య ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నేజర్, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్
కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment