స్వదేశంలో న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ కివీస్ ఓటమి పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 0-3 తేడాతో న్యూజిలాండ్ వైట్‌వాష్‌కు గురైంది. ఆఖరి టీ20 విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత ఆసీస్‌ను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 67-2(6.2 ఓవర్లు) వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే కొద్దిసేపుటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ మళ్లీ ఆరంభమైంది. కానీ 8.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టింది. అనంతరం వర్షం మళ్లీ తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.
అయితే ఆసీస్ ఇన్నింగ్స్ 118(10.4 ఓవర్లు) వద్ద వర్షం మళ్లీ ఆటకు బ్రేక్‌లు వేసింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ ఆసీస్ ఇన్నింగ్స్ మాత్రం 10. 4 ఓవర్లకే ముగిసిపోయింది. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం కివీస్ టార్గెట్‌ను 10 ఓవర్లలో 126 పరుగులగా నిర్ణయించారు.
127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) ఆఖరివరకు పోరాడాడు. ఇక ఆసీస్ బౌలర్లలో జంపా, షార్ట్, జానెసన్ తలా ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షార్ట్(27), మాక్స్‌వెల్(20) పరుగులతో రాణించారు.
చదవండి: Babar Azam: ఏయ్ దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment