CWC 2023: న్యూజిలాండ్‌ ముందు భారీ టార్గెట్‌ ఉంచిన ఆస్ట్రేలియా | CWC 2023: Australia Set 389 Runs Target For New Zealand | Sakshi
Sakshi News home page

CWC 2023: న్యూజిలాండ్‌ ముందు భారీ టార్గెట్‌ ఉంచిన ఆస్ట్రేలియా

Published Sat, Oct 28 2023 2:46 PM | Last Updated on Sat, Oct 28 2023 2:58 PM

CWC 2023: Australia Set 389 Runs Target For New Zealand - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్‌ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది.

ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓ దశలో ఆసీస్‌ జోరు చూసి ఈ మ్యాచ్‌లో 500 పరుగుల స్కోర్‌ దాటడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆఖర్లో కివీస్‌ బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్‌ 400 లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్‌ ఆఖరి 4 వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడం విశేషం.

49 ఓవర్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి మ్యాట్‌ హెన్రీ.. స్టార్క్‌ వికెట్‌ తీయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమాప్తమైంది. కివీస్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (10-0-37-3) నమోదు చేయగా.. బౌల్ట్‌ 3, సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు. కివీస్‌ బౌలర్లలో ఫిలిప్స్‌ తప్పించి మిగతావారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement