టీమిండియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. హాజిల్‌వుడ్ కాలి మడమ గాయంతో గత కొంతకాలంగా భాదపడతున్నాడు. ఈ క్రమంలో పూర్తిఫిట్‌నెస్ సాధించకపోయనప్పటికీ ఐపీఎల్-2023లో ఆర్సీబీ తరపున ఆడేందుకు భారత్‌కు వచ్చాడు.
అయితే కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్-2023 మధ్యలోనే తన స్వదేశానికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి.. నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నాడు. ఇక తన ఫిట్‌నెస్‌పై హాజిల్‌వుడ్ తాజాగా స్పందించాడు.
"నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాను. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం వరకు ప్రతీ సెషన్‌లో ప్రాక్టీస్ చేయడమే నా పని. టెస్టు క్రికెట్‌కు టీ20 క్రికెట్ పూర్తి భిన్నం. టీ20ల్లో మన బౌలింగ్‌లో చాలా వేరియషన్స్ చూపించాలి. వైడ్ యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ బాల్స్ వేయడానికి చాలా కష్టపడాలి. ఈ క్రమంలో బౌలర్లకు తమ గాయాలు తిరగబెట్టే అవకాశం ఉందని" ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాజిల్‌వుడ్ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment