థర్డ్ అంపైర్ను తిట్టిన హాజల్వుడ్ | Australia's Josh Hazlewood pleads guilty after abusing third umpire | Sakshi
Sakshi News home page

థర్డ్ అంపైర్ను తిట్టిన హాజల్వుడ్

Published Tue, Feb 23 2016 5:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

థర్డ్ అంపైర్ను తిట్టిన హాజల్వుడ్

థర్డ్ అంపైర్ను తిట్టిన హాజల్వుడ్

క్రిస్ట్చర్చ్: సాధారణంగా ఫీల్డ్ అంపైర్లపై క్రికెటర్లు అసహనం వ్యక్తం చేసే సందర్భాలు వారి చేష్టల్లో మనకు కనిపించినా.. మాటల్లో మాత్రం నియంత్రణం కోల్పోరు. అయితే అతనొక అంతర్జాతీయ క్రికెటర్ అనే సంగతి మరిచిపోయి ప్రవర్తించాడు ఆస్ట్రేలియా ఆటగాడు హాజల్వుడ్. టెలివిజన్ రీప్లేను పరిశీలించే థర్డ్ అంపైర్ను టార్గెట్ చేస్తూ బూతు పురాణం అందుకున్నాడు. పూర్తిగా నియంత్రణ కోల్పోయిన హాజల్ వుడ్ థర్డ్ అంపైర్ను అనకూడని మాట అనేశాడు.

ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన అటు క్రికెట్ పెద్దల దగ్గర్నుంచీ  అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నాల్గో రోజు ఆటలో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ 88 పరుగుల వద్ద ఉండగా హాజల్ వుడ్ యార్కర్ ను సంధించాడు. ఆ బంతి విలియమ్సన్ లెగ్ ను తాకడం.. హాజల్ వుడ్ అప్పీల్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ అవుట్ ను ఫీల్డ్ అంపైర్ మార్టినెస్ తిరస్కరించాడు. ఆపై వెంటనే కెప్టెన్ స్టీవ్ స్మిత్ టీవీ రిప్లే కోరాడు. ఆ నిర్ణయాన్ని సమీక్షించిన థర్డ్ అంపైర్ రిచర్డ్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవిస్తూ విలియమ్సన్ ను నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో సహనం కోల్పోయిన హాజల్వుడ్ ఆ థర్డ్ అంపైర్....? అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు.  హాజిల్ వుడ్ తిట్ల పురాణం వికెట్ల వద్దనున్న మైక్రోఫోన్ ద్వారా అక్కడ మ్యాచ్ ను వీక్షిస్తున్న టీవీ కామెంటేటర్లకు సైతం చేరింది. ఇది ఎంతమాత్రం క్షమించరాని చర్యగా టీవీ వ్యాఖ్యాత మార్క్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement