బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు వార్మప్‌లో హాజిల్‌వుడ్ కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు.
అయినప్పటికి నాలుగో రోజు ఆడేందుకు తన జట్టుతో కలిసి హాజిల్‌వుడ్ మైదానంలో అడుగుపెట్టాడు. ఒక్క ఓవర్ కూడా అతడు బౌలింగ్ చేశాడు. కానీ బౌలింగ్ చేసే క్రమంలో జోష్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ ఓవర్‌ను పూర్తి చేసి హాజిల్‌వుడ్ మైదానాన్ని వీడాడు.
అనంతరం స్కానింగ్ తరలించగా ఎడమవైపు లో గ్రేడ్ గాయమైనట్లు తేలింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ధ్రువీకరించింది. ఈ క్రమంలో మిగిలిన ఆట మొత్తానికి అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కూడా హాజిల్‌వుడ్ గాయం కారణంగానే దూరమయ్యాడు.
ఇప్పుడు మళ్లీ గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంది. అతడికి బ్యాకప్‌గా స్టార్ పేసర్ స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ఇప్పటికే రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన బోలాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ బ్రిస్బేన్ టెస్టుకు హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడంతో బోలాండ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
మళ్లీ హాజిల్‌వుడ్ గాయం పడడంతో బోలాండ్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ తడబడతుంది. నాలుగో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment