Ashes- Test Series: ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా తదుపరి మూడు టెస్టులకు కూడా పాత జట్టుతోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. రెండో మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఫాస్ట్‌బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘యాషెస్ సిరీస్.. మెల్‌బోర్న్, సిడ్నీ, హోబర్ట్... టెస్టులను.. ఆస్ట్రేలియా తొలుత ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టుతోనే ఆడనుంది. ఆటగాళ్లు మంగళవారం అడిలైడ్ నుంచి బయల్దేరుతారు. బుధవారం విశ్రాంతి తీసుకుంటారు’’ అని అధికారిక ప్రకటనలో తెలిపింది.
కాగా కరోనా పాజిటివ్ వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన సారథి ప్యాట్ కమిన్స్.. ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఐసోలేషన్‌కు వెళ్లిన కమిన్స్ మరోసారి కరోనా నిర్దారణ పరీక్షల తర్వాత నెగటివ్ ఫలితమే వస్తే తిరిగి జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా... అడిలైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించి ఆసీస్ విజయం దిశగా పయనిస్తోంది. కాగా మొదటి టెస్టులో ఏకపక్ష విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టు:
పాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసర్, జై రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.
రెండో టెస్టు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్
రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్
చదవండి: SA Vs IND: భారత్ పర్యటన.. ఆ మ్యాచ్‌లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు!
Australia have locked in their squad for the three remaining #Ashes Test matches 👇
— cricket.com.au (@cricketcomau) December 20, 2021
Comments
Please login to add a commentAdd a comment